Urvashi Rautela Apologizes To Saif : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దాడి నేపథ్యంలో నటి ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె సైఫ్‌కు క్షమాపణలు తెలిపారు. ఇన్‌స్టాలో ఆమె పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
"సైఫ్ సర్ మీకు ఈ మెసేజ్ చేరుతుందని నేను ఆశిస్తున్నాను. మీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రవర్తించిన తీరుకు ఎంతో బాధపడుతున్నాను. ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమల్ని క్షమాపణలు కోరుతున్నాను. ఆ ఇంటర్వ్యూ ఇచ్చే టైమ్‌లో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు అంతగా తెలియదు. గత కొన్ని రోజుల నుంచి నేను డాకు మహారాజ్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నా. దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడాను. ఇలా చేసినందుకు నేను సిగ్గు పడుతున్నాను. మీరు నన్ను క్షమించండి. ఈ దాడి తీవ్రత తెలిశాక నేను చాలా బాధపడ్డాను. ఆ టైమ్‌లో మీ ధైర్యం ఎంతో ప్రశంసనీయం. మీపై నాకు చాలా గౌరవం పెరిగింది" అని ఊర్వశీ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పింది.
ఇదీ జరిగింది :
సైఫ్‌పై జరిగిన దాడి గురంచి ఆయన అభిమానులతో పాటు ఎంతో మంది సెలబ్రీటీలు సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజులుగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఆమెను సైఫ్ ఘటనపై స్పందిచమని కోరగా, ఆ సమయంలో ఊర్వశీ తన వజ్రపు ఉంగరాన్ని, వాచీని చూపించి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.
"సైఫ్‌పై దాడి ఎంతో దురదృష్టకరం. నేను యాక్ట్ చేసిన 'డాకు మహారాజ్' సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఆ సినిమా సుమారు రూ.150కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దీంతో మా అమ్మ ఓ వజ్రపు ఉంగరాన్ని నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక మా నాన్న ఓ రోలెక్స్ వా్ను ప్రెజెంట్ చేశారు. కానీ, వీటిని నేను వేసుకుని బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా సరే మనపై అలాగే దాడి చేస్తారని భయంగా ఉంది" అని చెప్పుకొచ్చింది.
Reporter: “Saif Ali Khan got stabbed. What do you have to say about this?”
— Aaraynsh (@aaraynsh) January 17, 2025
Urvashi Rautela: “Yes, after Daaku Maharaj crossed 105 crores, my mom gifted me this diamond Rolex watch, and my dad gave me this mini watch!” 🥲
pic.twitter.com/FstP38BeXS
30 గంటలైనా దొరకని నిందితుడి ఆచూకీ!- ఇప్పటికీ నో క్లూ!
సైఫ్‌పై దాడి చేసిన నిందితుడి ఫొటో రిలీజ్- అత్యవసర మెట్ల మార్గం నుంచి ఇంట్లోకి!