Sobhita Dhulipala Biography: శోభిత ధూళిపాళ్ల..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈమె తెలుగులో ఓ రెండు మూడు సినిమాలు చేసినట్టు మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే.. అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్ మెంట్ జరగడంతో.. ఈమె గురించిన పూర్తి సమాచారం కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు నెటిజన్స్. మరి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలుగింటి అమ్మాయే:చూడటానికి ఇంటర్నేషనల్ మోడల్‌లా కనిపిస్తున్న శోభిత.. అచ్చ తెలుగింటి అమ్మాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో ఈమె జన్మించారు. 1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు తెనాలిలో శోభిత జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్. పదహారేళ్లూ వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత.. వైజాగ్‌లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్లో తన చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబయి యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్‌లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకున్నారు.
చీరకట్టుకు 'వైజాగ్' పిల్ల మోడ్రన్ టచ్.. నడుమును విల్లుగా వంచుతూ.. హాట్‌హాట్‌గా..
తొలుత మోడల్‌గా: శోభిత ధూళిపాళ్ల మొదట ఒక మోడల్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు. 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. "ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013" టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తరువాత భారతదేశం తరపున "మిస్ ఎర్త్ 2013" పోటీల్లోనూ పాల్గొన్నారు. కానీ అక్కడ టైటిల్ గెలవలేకపోయారు. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు.