ETV Bharat / entertainment

డేంజర్‌ జోన్‌లో టాప్ కంటెస్టెంట్ - సపోర్ట్ చేయమంటూ RGV ఓపెన్ స్టేట్​మెంట్​ - Ram Gopal Varma Tweet on Sonia - RAM GOPAL VARMA TWEET ON SONIA

Bigg Boss 8 Telugu: ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బిగ్ బాస్ బ్యూటీ కోసం నేరుగా రంగంలోకి దిగారు. ఆమెకు ఓటు వేయాలంటూ తన అభిమానులను కోరారు. ఈ మేరకు ఆమెతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆమె ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Bigg Boss 8 Telugu
Ram Gopal Varma Tweet (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 25, 2024, 4:17 PM IST

Ram Gopal Varma Tweet on Sonia Akula: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు పూర్తయింది. మొదటి వారం బేబక్క, రెండో వారం శేఖర్​ బాషా, మూడో వారం అభయ్​ నవీన్​ ఎలిమినేట్​ కాగా.. నాలుగో వారం మరొకరిని బయటికి పంపేందుకు సోమవారం నామినేషన్స్​ జరగగా.. ఆ రాత్రి నుంచే ఓటింగ్ ప్రారంభమైంది. అయితే, ఈ క్రమంలోనే ఎలిమినేషన్ అంచున ఉన్న ఓ అమ్మాయి కోసం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. ఆమెకు ఓటు వేయాలంటూ అభిమానులకు కోరుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. సోనియా ఆకుల. మరి సోనియా గురించి ఆర్జీవీ ఏమని ట్వీట్​ చేశారో ఇప్పుడు చూద్దాం..

ఎనిమిదో సీజన్‌లోకి మొత్తం 14 మంది సెలెబ్రిటీలు ఎంటర్​ కాగా.. అందులో తెలుగు అమ్మాయి సోనియా ఆరంభంలోనే అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. అందుకు తగ్గట్లుగానే హౌస్‌లోనూ తొలి రోజుల్లో ఎంతో యాక్టివ్‌గా ముందుకు సాగింది. కానీ, ఆ తర్వాత నుంచి తన ప్రవర్తనతో తరచూ విమర్శలను ఎదుర్కొంటూ వస్తుంది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్​లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సోనియా.. నిత్యం పృథ్వీరాజ్, నిఖిల్ పక్కనే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నాలుగో వారం ఇంటి నుంచి వెళ్లేందుకు నామినేట్ కాగా.. అన్​అఫీషియల్​ పోల్స్​లో తక్కువ ఓట్లతో ఈమెనె లాస్ట్​లో ఉన్నట్లు తెలుస్తోంది.

రంగంలోకి దిగిన ఆర్జీవీ: ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆమె కోసం రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆమెకు ఓట్ వేయాలని అభిమానులను కోరుతూ ఎక్స్​లో పోస్ట్ చేశారు. 'సోనియా ఆకుల.. బలం, యాటిట్యూడ్‌కు నిదర్శనం. ఈ అమ్మాయి బిగ్ బాస్‌లో చాలా బాగా ఆడుతోంది. మీ ఓటును సోనియాకు వేసి ప్రేమను చూపించండి' అంటూ ఎక్స్​లో పోస్ట్ చేశారు. దీంతో పాటు సోనియాతో దిగిన ఫొటోను సైతం షేర్ చేశారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా: అంతకుముందు బిగ్ బాస్ షో అంటే తెలియదు అన్న రాంగోపాల్ వర్మ.. ఈ మధ్య కాలంలో ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక కంటెస్టెంట్‌కు మద్దతు తెలుపుతున్నారు. నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న అరియానా గ్లోరీకి మద్దతుగా ఓ ట్వీట్ చేయగా.. ఆ తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్​లో కంటెస్టెంట్‌గా వచ్చిన శ్రీ రాపాకకు కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన తెలుగమ్మాయి సోనియా ఆకులకు ఆర్జీవీ సపోర్ట్​ చేస్తున్నారు. అంతేకాదు సీజన్ ఆరంభంలో ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనూ ఓ వీడియోను పంపించి తన మద్దతును తెలిపారు.

నామినేషన్లలో ఏడుగురు.. ఆమె సేఫ్​: మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ కోసం ఏడుగురు నామినేట్ ఉన్నారు. సోనియా, ఆదిత్య, పృథ్వీ, మణికంఠ, నైనిక, నబీల్, ప్రేరణ నామినేషన్లలోకి రాగా చీఫ్ అయిన కారణంగా నిఖిల్‌కు ఓ సూపర్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీని వల్ల నామినేషన్లలో ఉన్న ఎవరో ఒకరిని నిఖిల్ సేవ్ చేసే ఛాన్స్ నిఖిల్​కు రాగా.. అతడు నైనికను సేవ్ చేశాడు. దీంతో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. ఈ వారంలో వీరిలో ఒకరు ఎలిమినేట్​ కావాల్సి ఉంది. మరి ఆర్జీవీ ట్వీట్​తో సోనియాకు ఓట్లు వేసే వారి సంఖ్య పెరుగుతుందో? లేదో? చూడాలంటే సండే వరకు ఆగాల్సిందే..!

బిగ్​బాస్​ 8: "ముందైతే కొడతా - ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది" - హాట్​హాట్​గా నాలుగో వారం నామినేషన్లు! - Bigg Boss Fourth Week Nominations

బిగ్​బాస్​ 8: "అది కంప్లైంట్​ చేయడానికి నువ్వు ఎవరు" - నబీల్​ వర్సెస్​ సోనియా! - నామినేషన్ల రచ్చ - Bigg Boss 8 Fourth Week Nominations

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.