ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: "నీకు ఆ దమ్ములేదా?" - యష్మీ వర్సెస్​ మణికంఠ - నామినేషన్లలో ఎంతమందంటే! - Bigg Boss 8 Third Week Nominations

Bigg Boss Nominations: బిగ్​బాస్​ సీజన్​ 8లో తొలివారం బేబక్క ఇంటి నుంచి బయటికి వెళ్లగా.. రెండో వారం శేఖర్​ బాషా ఎలిమినేట్​ అయ్యాడు. ఇక మూడో వారం ఇంటి నుంచి ఒకరిని బయటికి పంపేందుకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మరి ఇందులో ఎంత మంది నామినేట్​ అయ్యారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Bigg Boss Season 8
Bigg Boss Season 8 Third Week Nominations (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 17, 2024, 10:17 AM IST

Bigg Boss Season 8 Third Week Nominations: బిగ్​బాస్​లో కిక్​ ఇచ్చే ఎపిసోడ్​.. నామినేషన్స్. ఇప్పటికే రెండు వారాల ఆట పూర్తి చేసుకున్న బిగ్​బాస్​.. మూడో వారంలోకి ఎంటర్​ అయ్యింది. ఇక ఈ వారం ఇంటి నుంచి ఒకరిని బయటికి పంపించేందుకు సోమవారం(సెప్టెంబర్​ 16) రోజున నామినేషన్స్​ ప్రక్రియను మొదలుపెట్టాడు బిగ్​బాస్​.​ మరి ఇందులో ఎంత మంది నామినేట్​ అయ్యారు? ఎవరు ఎవరిని నామినేట్​ చేశారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారం నామినేషన్లకి 'ట్రాష్ బిన్' (చెత్త బుట్ట) థీమ్ పెట్టారు. ఈ ఇంట్లో ఉండేందుకు ఎవరు అనర్హులు అని మీరు భావిస్తారో.. వారిపై చెత్తను వేసి నామినేట్​ చేయమని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక చీఫ్‌లు అయిన కారణంగా అభయ్, నిఖిల్‌ను ఎవరూ నామినేట్ చేయకూడదంటూ చెప్పాడు. ఇక ముందుగా నామినేషన్ల ప్రక్రియను సీతతో స్టార్ట్ చేశాడు బిగ్‌బాస్.

సీత ముందుగా యష్మీని నామినేట్ చేసింది. గేమ్స్‌లో డామినేటింగ్‌గా, చీఫ్‌గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నట్లు అనిపించిందంటూ యష్మీని నామినేట్ చేసింది సీత. ఇక నువ్వు గెలవాలని అనే కసి నాకు నచ్చుతుంది.. కానీ ఎలాగైనా గెలవాలంటూ చేసే ప్రయత్నాలు నాకు నచ్చలేదు.. నీ అగ్రెషన్ నాకు అసలు నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది సీత.

విష్ణుప్రియకి.. ఛాన్స్ రాగా ముందుగా ప్రేరణను నామినేట్ చేసింది. సాక్స్ టాస్కులో సంచాలక్‌గా ఫెయిల్ అయ్యావంటూ చెప్పుకొచ్చింది. ఇక దీనికి ప్రేరణ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయడంతో కాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్ నడిచింది. ఇక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది విష్ణుప్రియ. మీరు చీఫ్‌గా ఉన్నప్పుడు మీ టీమ్ గేమ్స్ ఫెయిర్‌గా ఆడలేదు.. అలానే పనులు ఎక్కువగా మా టీమ్‌కే ఇచ్చారంటూ విష్ణు చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్​ నడిచింది.

మణికంఠ.. తన ఫస్ట్ నామినేషన్ యష్మీకి వేశాడు. నువ్వు చీఫ్‌గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావ్.. అలానే ప్రతి పనిలోనూ కావాలని చేస్తున్నారా లేదా అంటూ దూరిపోయావ్.. అంటూ మణికంఠ అన్నాడు. దీనికి యష్మీ ఏదో సమాధానం చెబుతుంటే మణి సీరియస్ అయ్యాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత అగ్రెషన్ రీజన్‌తో పృథ్వీని నామినేట్ చేశాడు మణికంఠ.

బిగ్​బాస్​ 8: శేఖర్​ బాషా ఎలిమినేషన్​కు అసలు కారణం ఇది! - రెమ్యునరేషన్​ వివరాలు కూడా లీక్​

ప్రేరణ.. మొదటిగా సీతను నామినేట్ చేసింది. నువ్వు గేమ్‌కి కావాల్సిన దాని కంటే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నావ్ అంటూ వింత రీజన్ చెప్పింది. దీనికి సీత కూడా గట్టిగానే వాదించింది. ఆ తర్వాత విష్ణుని నామినేట్ చేస్తూ సిల్లీ రీజన్ చెప్పింది ప్రేరణ దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదోపవాదాలు జరిగాయి.

ఆదిత్య.. విష్ణుప్రియ, మణికంఠలను నామినేట్ చేశాడు. అలానే నైనిక.. సోనియా, ప్రేరణలను నామినేట్ చేసింది. ఈ నామినేషన్లలో పెద్దగా డిస్కషన్ ఏం జరగలేదు.

యష్మీ.. మణికంఠకి రివెంజ్ నామినేషన్ వేసింది. "చూడు.. చాక్లెట్ బాయ్.. ఈ హౌజ్​లో నేను ఎన్ని వారాలు ఉంటానో అన్ని వారాలు నిన్ను నామినేట్ చేస్తా.. ఎందుకంటే నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశావ్.. నేను ఫ్రెండ్ షిప్‌కి చాలా వాల్యూ ఇస్తా.. అలాంటి విషయంలో నువ్వు నన్ను మోసం చేశావ్.. నాకు నువ్వు ఈ హౌస్‌కి చాలా డేంజరస్ అనిపిస్తుంది.. నా హార్ట్‌ను నువ్వు బ్రేక్ చేసినదానికి నిన్ను నామినేట్ చేస్తున్నా" అంటూ యష్మీ అంది. తర్వాత తన రెండో నామినేషన్ నైనికకి వేసింది యష్మీ. తర్వాత నబీల్.. యష్మీ, ప్రేరణలను నామినేట్ చేయగా పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు.

బిగ్​ బాస్​లో లవ్​ బర్డ్స్! - వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కన్ఫామ్ అంటగా?

సోనియా.. ముందుగా నైనికను నామినేట్ చేసింది. నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావంటూ రీజన్ చెప్పింది. తర్వాత తన రెండో నామినేషన్ ఎవరో చెప్పకముందే యష్మీ లేచి నిల్చుంది. దీంతో కాసేపు నవ్వి నీకు ఫస్ట్ వీక్ నుంచి రీజన్స్ చెప్పాలా అంటూ సోనియా అడిగింది. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి పర్సనల్స్​ వరకు వెళ్లారు.

ఇక నామినేషన్స్ చివరిలో ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. నిఖిల్, అభయ్ ఇద్దరూ చీఫ్‌లు అయినప్పటికీ ఇద్దరి టీమ్‌లు సమానం.. కనుక మీ ఇద్దరిలో ఒకరు మాత్రమే సేఫ్ అయ్యే అవకాశం ఉంది.. కనుక మీరే చర్చించుకొని ఎవరు నామినేషన్లలోకి వెళ్తారో డెసిషన్ చెప్పండి.. అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో నిఖిల్-అభయ్ కాసేపు మాట్లాడుకున్నారు. నువ్వు ఆల్ రెడీ రెండుసార్లు నామినేషన్లలోకి వెళ్లావ్ కదా.. ఈసారి నేను వెళ్తా.. అంటూ అభయ్ వాలంటీరీగా నామినేషన్లలోకి వచ్చాడు. దీంతో మొత్తం 8 మంది సభ్యులు ఈసారి నామినేషన్లలోకి వచ్చారు. వీరిలో అత్యధికంగా యష్మీకి ఐదు ఓట్లు పడ్డాయి.

నామినేట్​ అయిన సభ్యులు వీరే:

  • ప్రేరణ
  • నైనిక
  • పృథ్వీ
  • మణికంఠ
  • విష్ణుప్రియ
  • సీత
  • యష్మీ
  • అభయ్

"బిగ్‌బాస్‌కి రావడమే నేను చేసిన.." - హౌజ్​లో బరస్ట్​ అయిన విష్ణుప్రియ - ఏం జరిగిందో తెలుసా?

బిగ్​బాస్​ 8: తొలిరోజే మొదలైన రచ్చ - సోనియా వర్సెస్​ శేఖర్​ బాషా! ప్రోమో చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.