ETV Bharat / entertainment

బిగ్​బాస్ 8: "ఇక ఆపేద్దాం" - విష్ణుప్రియ,​ పృథ్వీరాజ్​ బ్రేకప్​ - అర్ధరాత్రి ఏం జరిగింది? - VISHNU PRIYA AND PRUTHVI LOVE TRACK

- అర్ధరాత్రి నిఖిల్​, ప్రేరణ, యష్మీ, పృథ్వీ రాజ్​ ముచ్చట్లు - విష్ణుప్రియను ఓదార్చిన నబీల్​

Bigg Boss 8
Bigg Boss 8 (ETV Bharat)
author img

By ETV Bharat Entertainment Team

Published : Oct 23, 2024, 12:47 PM IST

Bigg Boss Vishnu Priya and Pruthvi: బిగ్​బాస్​ సీజన్​ 8లో లవ్​ బర్డ్స్​ అంటే షో చూసే ఎవరికైనా గుర్తుకువచ్చేది విష్ణు ప్రియ - పృథ్వీ. కారణం.. ఎక్కడ చూసినా వీళ్లిద్దరే కనిపించడం, పృథ్వీ పనులు విష్ణు చేయడం, అతని పేరు ఎత్తితే ఈమె సిగ్గుపడటం.. ఇలా ఒక్కటేమిటి.. వీళ్లిద్దరి మధ్య లవ్​ ట్రాక్​ నడుస్తోందని చెప్పేందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అంతెందుకు వీకెండ్లో​ నాగార్జున సైతం వీళ్లిద్దరి గురించి మాట్లాడే విషయాలు కూడా ఎక్కువే. అయితే తాజాగా వీళ్లిద్దరి మధ్య బ్రేకప్​ జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం నామినేషన్స్​ తర్వాత హౌజ్​లో ఈ పరిణామం జరిగినట్లు టాక్​. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

8వ వారం నామినేషన్స్‌లో అటు పృథ్వీ.. ఇటు విష్ణుప్రియను మిగిలిన కంటెస్టెంట్స్ టార్గెట్​ చేశారు. "అసలు మీరిద్దరూ సింగిల్‌గా ఎక్కడా కనిపించట్లేదు.. చాలా వారాలుగా మీ గేమ్ కూడా ఏం కనిపించట్లేదు" అంటూ ఒకరి తర్వాత ఒకరు నామినేషన్స్ వేశారు. ముఖ్యంగా ప్రేరణ అయితే విష్ణుప్రియ నోటి నుంచే పృథ్వీపై ఉన్న ఇష్టాన్ని అందరిముందు బయటపెట్టేలా చేసింది. ఇక నామినేషన్స్​ తర్వాత అర్ధరాత్రి నిఖిల్​, ప్రేరణ, యష్మీ, పృథ్వీలు కలిసి ​మీటింగ్​ పెట్టారు. ఇక ఈ మీటింగ్‌లో పృథ్వీకి గట్టిగానే బ్రెయిన్ వాష్ చేసింది యష్మీ.

నిఖిల్‌కి ప్రేరణ మసాజ్ చేస్తుండగా పృథ్వీతో యష్మీ సీరియస్ డిస్కషన్ పెట్టింది. "పృథ్వీ ఒక ఫ్రెండ్‌గా చెబుతున్నా విను.. నాకే మిమ్మల్ని చూసి చూసి విసుగొచ్చింది.. ఏంటి వాడికి తను (విష్ణు) స్పేస్ ఇవ్వట్లేదు.. ఇద్దరూ స్పేస్‌యే తీసుకోవట్లేదు.. ప్రతిసారి ఎక్కడ చూసినా ఇద్దరు ఇద్దరే కనిపిస్తారు.. ఎంత ఇరిటేషన్​ వచ్చిందో. రేయ్ ఇది ఇండివీడ్యువల్ గేమ్.. నీకు ఏదైనా ఉంటే బయట చూసుకుందాం.. దానికి ఒక టైమ్ ఉంటుంది.. నాకే ఇలా అనిపిస్తుందంటే వేరే వాళ్లకి అనిపించడంలో తప్పేలేదు.. డైరెక్ట్‌గా క్వశ్చన్ అడుగుతా చెప్పు.. నీకు ఏదైనా ఫీలింగ్ ఉందా తన(విష్ణుప్రియ)పై.." అని యష్మీ అడిగితే "లేదు" అంటూ పృథ్వీ ఆన్సర్​ ఇచ్చాడు.

అయితే తను జస్ట్ ఫ్రెండ్.. అంతేనా అని యష్మీ అంటే మళ్లీ "అవును" అన్నాడు పృథ్వీ. "మరి ఎందుకు హౌజ్​లో ఉన్న మిగిలిన వాళ్లతో కాకుండా తనతో ఎందుకు క్లోజ్‌గా ఉంటావ్" అంటూ యష్మీ అడిగింది. "అలా ఏం లేదు తను వస్తే మాట్లాడతా.. నేను వెళ్లి మాట్లాడేది తక్కువే" అంటూ పృథ్వీ అన్నాడు. ఆ అమ్మాయి రాకపోతే నువ్వు వెళ్లవ్.. సరే అంటూ యష్మీ అంది.

బిగ్​ బాస్​లో లవ్​ బర్డ్స్! - వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కన్ఫామ్ అంటగా?

సెపరేట్​గా విష్ణు - పృథ్వీ మాటలు: ఇక ఈ డిస్కషన్​ ముగిశాక విష్ణుప్రియతో సెపరేట్​గా మాట్లాడాడు పృథ్వీ. "నీకు ఏమైనా మనం ఓవర్ అయినట్లు అనిపిస్తుందా హౌజ్​"లో అంటూ పృథ్వీ అడిగితే "నో" అంటూ విష్ణు అంది. "నేను నీకు క్లారిటీ ఇచ్చా కదా నాకు ఎలాంటి రిలేషన్ షిప్ వద్దు అని.. నాకు సింగిల్‌గా ఉండటమే ఇష్టం.. నీకు ఆ క్లారిటీ ఉంటే ఫైన్.. లేదు నీకు ఏదైనా నా మీద లైట్‌గా ఇది అనిపిస్తుంది అంటే చెప్పు.. ఇక ఆపేద్దాం" అని పృథ్వీ అన్నాడు. దీంతో "డన్" అంటూ విష్ణు అంది. "నీకు ఏమనిపిస్తుంది.. రియల్‌గా ఫీల్ అవుతున్నావా" అని విష్ణుని అడిగాడు పృథ్వీ. దీనికి నవ్వుతూ నీకు ఏమనిపిస్తుంది.. నా గురించి తెలుసు కదా అని విష్ణు అంటే "నాకు అనిపిస్తుంది నీకు ఏదో ఫీలింగ్ అవుతుందని" అంటూ పృథ్వీ చెప్పాడు.

ఇటు పృథ్వీ ఒంటరిగా సిగరెట్ తాగుతూ ఆలోచిస్తుంటే.. అటు విష్ణుప్రియ బెడ్ దగ్గరికి బాధగా వచ్చింది. ఇది చూసి అంతా ఓకేనా ఏమైంది అంటూ నబీల్ అడిగాడు. దీంతో విష్ణు కాస్త ఎమోషనల్‌గా ఫేస్ పెట్టింది. దీంతో "పృథ్వీ గురించా.. ఏం ఆలోచించకు.. నీకు మంచి భర్త దొరుకుతాడులే" అంటూ నబీల్ అన్నాడు. ఇలా విష్ణు ప్రియ, పృథ్వీ మధ్య లవ్​ ట్రాక్​కు శుభం కార్డ్​ పడ్డట్టు అయ్యింది. మరి నిజంగానే అలానే ఉంటారా? లేదంటే మేము మాలాగే ఉంటామని మళ్లీ కలుస్తారో.. ముందు ముందు చూడాలి.

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.