తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నా స్టెప్పులు కుర్రకారును ఉర్రూతలూగిస్తాయ్' - సూర్యతో స్పెషల్ సాంగ్​పై శ్రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సూర్య తదుపరి సినిమాలో ప్రత్యేక గీతంపై ఆసక్తికర విషయాలు పంచుకున్న వింటేజ్ హీరోయిన్ శ్రియా

Shriya Saran Special Song In Surya Movie
Shriya Saran Special Song In Surya Movie (ETV Bharat, ANI)

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 7:13 AM IST

Shriya Saran Special Song In Surya Movie :తమిళ అగ్ర కథానాయకుడు సూర్య వరుస సనిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల 'కంగువా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో, డైరెక్టర్​ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమాలో బిజీగా ఉన్నారు. 'సూర్య 44' అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో అందాల భామ పూజా హెగ్డే ఫీమేల్​ లీడ్​లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ సినిమాలో సూర్యతో కలిసి అలనాటి అందాల హీరోయిన్ శ్రియ స్టెప్పులు వేయనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని శ్రియ ధ్రువీకరించారు. ఆ ప్రత్యేక పాట గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు.

తాను సూర్యతో కలిసి ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడానని చెప్పారు శ్రియ. ఈ స్పెషల్ సాంగ్ కోసం గోవాలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మించారని తెలిపారు. అందులో సూర్యతో కలిసి తాను వేసిన స్టెప్పులు- ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయని, కుర్రకారును ఉర్రూతలూగించేలా ఉంటాయని వెల్లడించారు. కాగా డిసెంబరులో ఈ పాటను రిలీజ్​ చేయడానికి మూవీ టీమ్​ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఇదిలా ఉండగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న రిలీజ్​ కానుంది.

ఇదిలా ఉండగా, ఈ ఏడాది మిహిర్​ దేశాయ్ డైరెక్ట్​ చేసిన బాలీవుడ్​ టీవీ సిరీస్​లో శ్రియా నటించింది. అంతేకాకుండా ఈ అమ్ముడు విక్టరీ వెంకటేశ్​ హీరోగా డైరెక్టర్​ తేజ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించనుంది. ఈ సినిమాను నిర్మాతలు సురేశ్​ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'ఆట నాదే వేట నాదే' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్​లో రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని చిత్ర బృందం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అంతేకాకుండా శ్రియా తమిళ్​లో మరో రెండు సినిమాలకు సైన్​ చేసినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details