ETV Bharat / entertainment

'అప్పుడు బన్నీతో అలా చెప్పా - కానీ ఇప్పుడు అవసరం లేదు' : రాజమౌళి

పుష్ప 2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి - ఆసక్తికర సంగతులు చెప్పిన జక్కన్న.

Pushpa's WILDFIRE JATHARA Rajamouli
Pushpa's WILDFIRE JATHARA Rajamouli (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Pushpa's WILDFIRE JATHARA Rajamouli : పుష్ప : ది రూల్‌ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పోలీస్‌గ్రౌండ్స్‌ (యూసఫ్‌గూడ)లో భారీ స్థాయిలో వైల్డ్‌ ఫైర్‌ జాతర పేరుతో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాజమౌళి మాట్లాడుతూ - "నార్త్​లో నీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా అక్కడ సినిమాను ప్రమోట్‌ చేయ్‌ అని పుష్ప 1 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అల్లు అర్జున్​కు చెప్పాను. మూడేళ్ల తర్వాత పుష్ప 2కు ఎలాంటి ప్రచారం అవసరం లేదని చెబుతున్నాను. వరల్డ్​ వైడ్​గా ఉన్న ఇండియన్స్ అంతా ఈ మూవీ టికెట్స్​ను బుక్‌ చేసుకుని ఉంటారని అర్థమవుతోంది. హీరో, దర్శకుడు ఇలా ఈ సినిమా గురించి ఏం మాట్లాడకపోయినా పర్వాలేదు. అందుకే ఓ సరదా సంఘటన చెబుతా. రెండుమూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్​ జరిగింది. ఇదే సమయంలో నేనూ అక్కడికెళ్లాను. సర్‌ సినిమాలోని ఓ సీన్‌ చూస్తారా? అని సుకుమార్ అడిగారు. చూస్తానని నేను చెప్పగానే ఎడిటర్‌ను పిలిపించి, కొన్ని మార్పులు చెప్పారు. అది పుష్ప రాజ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌. దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ ఎంత మ్యూజిక్‌ ఇవ్వగలిగితే అంత ఇచ్చేయొచ్చు అని చెప్పాను. మూవీ ఏ స్థాయిలో ఉంటుందో ఆ ఎపిసోడ్‌తోనే అర్థమైపోయింది" అని అన్నారు.

'పుష్ప 2' - రష్మికకు ఆ సెంటిమెంట్​ కలిసొస్తుందా?

26 నిమిషాల్లోనే 'పుష్ప 2' అదిరే ఘనత - రిలీజ్​కు ముందే 9 రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.