తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

OTTలోకి సెన్సేషనల్​ రియల్ క్రైమ్ థ్రిల్లర్ - ఎక్కడ చూడాలంటే? - షీనా బోరా కేసు ఓటీటీ

Sheena Bora Case OTT Release : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన డాక్యుమెంటరీ ఓటీటీలో స్ట్రీమింగ్​కు రెడీ అయింది. ఆ వివరాలు.

OTTలోకి సెన్సేషనల్​ రియల్ క్రైమ్ థ్రిల్లర్ - ఎక్కడ చూడాలంటే?
OTTలోకి సెన్సేషనల్​ రియల్ క్రైమ్ థ్రిల్లర్ - ఎక్కడ చూడాలంటే?

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 3:15 PM IST

Sheena Bora Case OTT Release : ఓటీటీలో క్రైమ్​ థ్రిల్లర్స్​కు మంచి డిమాండ్​ ఉంటుంది. అయితే ఈ మధ్య రియల్ క్రైమ్ థ్రిల్లర్స్​ను డాక్యుమెంటరీ రూపంలో రూపొందించి ఓటీటీలో స్ట్రీమింగ్​కు వదులుతున్నారు. అలా ఆ మధ్యలో 'కర్రీ అండ్ సైనైడ్'​ అనే రియల్ క్రైమ్​ థ్రిల్లర్​ టాప్​ ట్రెండింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రియల్ క్రైమ్ థ్రిల్లర్​ స్ట్రీమింగ్​కు రెడీ అవుతోంది.

వివరాల్లోకి వెళితే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్లో షీనా బోరా హత్య కేసు కూడా ఒకటి. ఇప్పుడు దీనిపై డాక్యుమెంటరీ సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్​కు రెడీ అయింది. 'ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ : బరీడ్‌ ట్రూత్‌' పేరుతో ఫిబ్రవరి 24 నుంచి ఓటీటీ ఆడియెన్స్​కు అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్​. షానా లెవీ, ఉరాజ్ బహల్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

ఏంటా షీనా బోరా హత్య కేసు : 2012లో షీనా బోరా హత్య జరిగింది. అయితే ఇది జరిగిన మూడేళ్ల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా దీన్ని బయటపెట్టాడు. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి చంపేసిందని పేర్కొన్నాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇన్వెస్టిగేషన్​లో తేలిన వివరాల ప్రకారం ఇంద్రాణీ మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత తన కుమార్తె షీనా, కుమారుడు మైఖెల్‌ను గువాహటిలోని తల్లిదండ్రుల వద్ద ఉంచేసింది. కొన్నాళ్లకు సంజీవ్‌ ఖన్నా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతడి నుంచి కూడా విడిపోయింది. తర్వాత ప్రముఖ మీడియా ఎగ్జిక్యూటివ్‌ పీటర్‌ ముఖర్జియాను వివాహమాడింది. పెద్దయ్యాక తల్లి గురించి తెలుసుకున్న షీనా ముంబయికి వెళ్లి ఆమెను కలిసింది.

ఈ క్రమంలోనే పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌తో షీనాకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారితీసింది. ఈ విషయంలో తల్లీ కుమార్తెల మధ్య తరచూ గొడవలు వచ్చేవి. ఆర్థిక విభేదాలూ కూడా తలెత్తాయి. దీంతో విసిగిపోయిన ఇంద్రాణీ, తన రెండో భర్త సంజీవ్‌, డ్రైవర్‌ శ్యామ్‌ రాయ్‌ సాయంతో కుమార్తెను హత్య చేసినట్లు ఇన్వెస్టిగేషనల్​లో తేలింది. షీనా మృతదేహాన్ని రాయ్‌గఢ్‌లోని ఓ అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లు తెలిసింది. 2015లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడు పోలీసు అధికారులు ఆ అటవీ ప్రాంతానికి వెళ్లి షీనా అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం అప్పట్లో వార్తలుగా వచ్చాయి. ఈ కేసులో ఇంద్రాణీ, సంజీవ్‌లతో పాటు పీటర్‌ను కూడా అరెస్టు చేశారు పోలీసులు. ఇకపోతే జైల్లోనే ఇంద్రాణీ - పీటర్ వివాహ బంధానికి కూడా ముగింపు పడింది. 2019లో వీరిద్దరూ డివొర్స్​ తీసుకున్నారు.

OTTలోకి ఆలస్యంగా హనుమాన్- స్ట్రీమింగ్​ కోసం అప్పటిదాకా ఆగాల్సిందే!

వేణు ఇంట్లో విషాదం- తండ్రిని కోల్పోయిన నటుడు

ABOUT THE AUTHOR

...view details