Shakeela Attacked By Her Daughter : నటి షకీలాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెపై తన పెంపుడు కుమార్తె శీతల్ దాడి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు షకీలా పోలీసులకు కంప్లైంట్ చేసింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. మనస్పర్థల కారణంగా శీతల్ నిన్న(జనవరి 20) ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత చర్చించుకునేందుకు రమ్మని పిలిస్తే తన సొంత తల్లిని వెంటపెట్టుకుని శీతల్ వచ్చినట్లు తెలిపిన షకీల ఆ సమయంలో నచ్చ జెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కోపంతో తనపై శీతల్ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న మహిళా న్యాయవాదితో శీతల్ తల్లి కూడా విచక్షణారహితంగా ప్రవర్తించిందని షకీల తెలిపింది. మరోవైపు అదే పోలీస్ స్టేషన్‌లో షకీలాపై శీతల్ కూడా కంప్లైంట్ చేసింది. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసు అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేస్తామని అన్నారు.
కాగా, శీతల్ --- షకీలా అన్న కుమార్తే కావడం గమనార్హం. శీతల్‌కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు నుంచే కూతురిలా పెంచిందట షకీల. ఈ విషయాన్ని శీతల్ చాలా వేదికలపై కూడా చెప్పింది! షకీల తన మేనత్త కాదని, అమ్మ అని చెప్పేది. అయితే ఇప్పుడు శీతల్ షకీలాపై దాడి చేయడం కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.