Rajendra Prasad About Self Killing : కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. అప్పట్లో అవకాశాల్లేక తాను బలవన్మరణం చేసుకోవాలని అనుకున్నట్లు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. చేతిలో డబ్బుల్లేక దాదాపు మూడు నెలల పాటు అన్నం తినలేదని చెప్పారు.
"మా నాన్న స్కూల్ టీచర్ ఎంతో చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఇంజినీరింగ్ పూర్తవ్వగానే సినిమాల్లోకి వెళ్దమనుకున్నాను. కానీ అది ఆయనకు నచ్చలేదు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా అది నీకు సంబంధించిన విషయమే. ఒకవేళ సక్సెస్ కాలేదంటే ఇంటికి రావద్దు అని అన్నారు. దీంతో మద్రాస్ వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి గోల్డ్ మెడల్ సాధించా. అయినా అవకాశాలు మాత్రం రాలేదు. పెద్ద గ్లామర్‌గా లేనని కూడా తెలుసు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్తే, రావొద్దు అని కోప్పడ్డారు. దీంతో బాధతో మళ్లీ మద్రాస్ వచ్చేశా. అప్పుడు చనిపోదామనుకున్నాను." అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
అయితే అంతకన్నా ముందు నా ఆత్మీయులు అందరినీ ఒక్క సారి చూడాలనిపించింది. దీంతో వాళ్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడాను. అప్పుడు చివరిగా నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఆఫీస్‌కు వెళ్లాను. మేలుకొలుపు సినిమాకు సంబంధించి అక్కడ ఏదో గొడవ జరిగింది. ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన, నన్ను తీసుకుని డబ్బింగ్ థియేటర్‌కు వెళ్లారు. ఓ సీన్‌కు నాతోనే డబ్బింగ్ చెప్పించారు. అది ఆయనకు బాగా నచ్చేసింది. రెండో సీన్‌కు డబ్బింగ్ చెప్పమన్నారు. భోజనం చేసి మూడు నెలలు అయింది. భోజనం పెడితే డబ్బింగ్ చెబుతా అని అన్నాను. అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అని చెప్పాను. దీంతో ఆయన కోప్పడి, ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టారు. నాకు ధైర్యం చెప్పారు. అలా డబ్బింగ్ ప్రయాణం మొదలు పెట్టాను. ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. అలా వచ్చిన డబ్బుతోనే మద్రాస్‌లో ఇల్లు కూడా కట్టాను. అక్కడే దర్శకుడు వంశీతో పరిచయం కాగా, ఆయన సినిమాలతోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాను" అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
డిసెంబర్ తొలి వారం 'పుష్ప'దే - క్రిస్మస్ కానుకగా 12 చిత్రాలు!
RC 16లో 'మున్నా భయ్యా' కన్ఫామ్ - అఫీషియల్ అనౌన్స్మెంట్