తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మిమ్మల్ని పురుషులు అవమానిస్తే అలా చేయండి' - ఆడవారికి సమంత సూక్తులు

వైరల్​గా మారిన హీరోయిన్​ సమంత కొత్త పోస్ట్​ - అందులో ఏం ఉందంటే?

Samantha New Post Inspirational Poem
Samantha New Post Inspirational Poem (source ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2024, 8:47 AM IST

Samantha New Post Inspirational Poem : సోషల్‌ మీడియాలో హీరోయిన్ సమంత ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సామ్‌ తనకు ఇష్టమైన ఓ ఇంగ్లీష్​ పద్యాన్ని షేర్‌ చేశారు. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ పద్యం తనలో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుందని పేర్కొన్నారు.

"మిమ్మల్ని అందరూ నిందిస్తున్నప్పుడు మీరు తలెత్తుకొని నిలబడితే, మగాళ్లందరూ మిమ్మల్ని అవమానించినప్పుడు, మిమ్మల్ని మీరు నమ్మితే అంటూ సాగే ఓ పద్యాన్ని సమంత పోస్ట్​ చేసి, దాన్ని అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఉందని క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

"విజయాలన్నింటినీ పక్కనపెట్టి ఒక్కసారి రిస్క్‌ చేసినప్పుడు అక్కడ ఓడిపోతే మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలి. ఆ ఓటమి గురించే ఆలోచించుకుంటూ కూర్చోకూడదు. మీ హృదయాన్ని కఠినంగా మార్చుకుని ధైర్యంగా ముందుకు వెళ్లాలి. మీ దగ్గర ఏమీ లేనప్పుడు సంకల్పం అనేదాన్ని గట్టిగా పట్టుకొని కదలండి." అని సామ్ చేసిన పోస్ట్​లో రాసి ఉంది.

సమంత సినిమాల విషయాని వస్తే(Samantha Upcoming Movies) - ఆమె ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. తన సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం చేస్తున్నారు. రీసెంట్​గానే ఆమె ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అందులోనే ఈ సినిమా తెరకెక్కనుంది. మరి ఈ సినిమా డైరెక్టర్​ ఎవరు? ఇతర విషయాలేమి తెలీదు. త్వరలోనే వీటి గురించి వెల్లడించనున్నారు.

మరోవైపు సమంత నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ సిటాడెల్‌ : హనీ బన్ని ప్రస్తుతం (Citadel : Honey Bunny) అమెజాన్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. దీనికి మంచి రివ్యూసే వస్తున్నాయి.

'సిటాడెల్​లో నటించడం ఓ సవాలు- అలాంటి పాత్రలు చెయ్యను'

బాలీవుడ్​లో బిజీబిజీగా సమంత- మరో వెబ్​సిరీస్​లో ఛాన్స్​- ఈసారి యువరాణిగా!

ABOUT THE AUTHOR

...view details