తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సమంత న్యూ 'బిగినింగ్స్' - ఆ స్పోర్స్ట్‌ టీమ్‌కు ఓనర్‌గా - Samantha New Journey - SAMANTHA NEW JOURNEY

Samantha New Journey : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన న్యూ జర్నీ గురించి అభిమానులతో పంచుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది.

SAMANTHA PICKLEBALL LEAGUE
Samantha (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 7:24 PM IST

Samantha New Journey : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా తన న్యూ జర్నీ గురించి అభిమానులతో పంచుకుంది. ఆమె వరల్డ్‌ పికిల్‌బాల్‌ లీగ్‌లో భాగంగా ఇటీవలే చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు ఓ ఈవెంట్‌లో వెల్లడించింది. ఇక చెన్నై టీమ్‌కు యజమానిగా ఉండటం తనకెంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంది. 'న్యూ బిగినింగ్‌' అంటూ ఆ పోస్ట్‌కు ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించింది. ఇది చూసి నెటిజన్లు తనకు 'ఆల్ ది బెస్ట్' చెప్తున్నారు. కొత్త జర్నీ సక్సెస్‌ఫుల్‌ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏంటీ పికిల్‌బాల్ ?
టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ను లాగే ఉంటుంది ఈ పికిల్‌బాల్‌ గేమ్‌. అయితే, దీనికి కొన్ని స్పెషల్ రూల్స్‌ ఉన్నాయి. 1965లో అమెరికాలో మొదలైన ఈ గేమ్‌కు ఇప్పుడు మన దగ్గర కూడా విశేష ఆదరణ లభిస్తోంది. ఇండోర్‌, అవుట్‌డోర్‌లో ఈ గేమ్‌ను బాగా ఆడొచ్చు. సాధారణంగా సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు ఆడతుంటారు. ప్రస్తుతం సామ్ పెట్టిన ఈ పోస్ట్‌తో ఈ గేమ్‌పై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది అభిమానులకు.

నార్త్ ఫిల్మ్ కోసం సన్నాహాలు!
ఇక సామ్ ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్​ నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' అనే మూవీలో నటిస్తోంది. మయోసైటిస్​ కారణంగా గతొ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి సెలెక్టడ్ సినిమాలకు సైన్ చేస్తోంది. అయితే ఇప్పటివరకు సౌత్​లోనే తన జోరు కొనసాగిస్తూ స్టార్​డమ్ తెచ్చుకున్న సామ్​, సిటాడెల్: హనీ బన్నీ​తో నార్త్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ సిరీస్ ఇంకా విడుదల కానప్పటికీ, సామ్ కోసం ప్రత్యేకంగా చూసేందుకు ఎంతో మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దానికంటే ముందే ఈ అమ్మడు బీటౌన్​లో తన యాక్టింగ్​తో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దాని ద్వారా సామ్​ మనసులోని కోరిక కూడా నెరవేరనుందట. ఇంతకీ అదేంటంటే?

సమంతకు ఎప్పటి నుంచో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్​ సరసన నటించాలన్న కోరిక ఉందట. ఆయనతో ఒక్కసారైనా స్క్రీన్​ షేర్ చేసుకోవాలనుకుందట. ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని సమాచారం. షారుక్​ అప్​కమింగ్​ మూవీలో ఈ చిన్నది ఓ కీ రోల్ ప్లే చేయనుందట. మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

నువ్వు వారియర్ - నీకోసం ప్రార్థిస్తుంటాను : సమంత

కథ ముగిసిపోలేదు - తిరిగి పైకి లేస్తా! : సమంత

ABOUT THE AUTHOR

...view details