తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దేశభక్తి మూవీలో సామ్​? నిజమైతే 'ఆమె' కోరిక నెరవేరినట్లే! - Samantha First Bollywood Movie - SAMANTHA FIRST BOLLYWOOD MOVIE

Samantha First Bollywood Movie : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో బాలీవుడ్​లో తన డెబ్యూ మూవీ చేయనుంది. అయితే ఈ సినిమా వల్ల సామ్​ మనసులో ఎప్పటి నుంచో ఉన్న కోరిక నెరవేరనుందట. ఇంతకీ అదేంటంటే?

Samantha First Bollywood Movie
Samantha (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 3:49 PM IST

Samantha First Bollywood Movie :సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ప్రొడక్షన్ హౌస్​ నిర్మిస్తున్న 'మా ఇంటి బంగారం' అనే మూవీలో నటిస్తోంది. మయోసైటిస్​ కారణంగా గతొ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి సెలెక్టడ్ సినిమాలకు సైన్ చేస్తోంది. అయితే ఇప్పటివరకు సౌత్​లోనే తన జోరు కొనసాగిస్తూ స్టార్​డమ్ తెచ్చుకున్న సామ్​, సిటాడెల్: హనీ బన్నీ​తో నార్త్​లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఆ సిరీస్ ఇంకా విడుదల కానప్పటికీ, సామ్ కోసం ప్రత్యేకంగా చూసేందుకు ఎంతో మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దానికంటే ముందే ఈ అమ్మడు బీటౌన్​లో తన యాక్టింగ్​తో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దాని ద్వారా సామ్​ మనసులోని కోరిక కూడా నెరవేరనుందట. ఇంతకీ అదేంటంటే?

సమంతకు ఎప్పటి నుంచో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్​ సరసన నటించాలన్న కోరిక ఉందట. ఆయనతో ఒక్కసారైనా స్క్రీన్​ షేర్ చేసుకోవాలనుకుందట. ఇప్పుడు ఆ కోరిక నెరవేరిందని సమాచారం. షారుక్​ అప్​కమింగ్​ మూవీలో ఈ చిన్నది ఓ కీ రోల్ ప్లే చేయనుందట.

సినీ వర్గాల సమాచారం ప్రకారం, 'డంకీ' డైరెక్టర్ రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్​లో రానున్న ఓ చిత్రంలో షారుక్​, సామ్ నటించనున్నారట. ఇప్పుడు ఇదే విషయం బీటౌన్​లో పాటు నెటింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ అభిమానులు మాత్రం తెగ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరగా సామ్​ హిందీలోనూ డెబ్యూ చేయాలని ఆశిస్తున్నారు. ఈ సినిమా ఆమెకు స్ట్రాంగ్ కమ్​బ్యాక్​ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, ఇదే సినిమాకు సంబంధించిన మరో రూమర్​ కూడా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, ఈ మూవీ యాక్షన్​తో దేశభక్తి నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇది గనుక నిజమైతే సామ్ ఇటువంటి జానర్​లో నటించడం తొలిసారి అవుతోంది.

మరోవైవు సామ్​ మాలీవుడ్​ మెగాస్టార్​ మమ్ముట్టితో సినిమా చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ గౌతమ్ మేనన్‌ డైరెక్షన్​లో రానున్న ఆ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట. చూస్తుంటే ఈ సినిమా కూడా దాదాపు ఖాయమైనట్లే తెలుస్తోంది.

'వాటి కోసం మనమే వెతుక్కోవాలి' - ధ్యానం చేస్తున్న సామ్ - Samantha Meditation

ఆ విషయాన్ని నెగటివ్​గా చూడను : సమంత

ABOUT THE AUTHOR

...view details