తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వెబ్​సిరీస్​లో కలిసి నటించనున్న షారుక్​, సల్మాన్! - Salman Khan Sharukh Khan Webseries - SALMAN KHAN SHARUKH KHAN WEBSERIES

Salman Khan Sharukh Khan : షారుక్​ ఖాన్, సల్మాన్‌ ఖాన్​లు కలిసి ఒకే వేదికపై కనిపించారంటే అభిమానులకు పండగే. అయితే రీసెంట్​గా పఠాన్, టైగర్ 3లో కలిసి కనిపించిన వీరిద్దరు మరోసారి ఇంకో ప్రాజెక్ట్​ కోసం కలిసి పనిచేయబోతున్నారట. పూర్తి వివరాలు స్టోరీలో.

Source IANS
Sharukh Salman khan (Source IANS)

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 3:54 PM IST

Salman Khan Sharukh Khan :బాలీవుడ్ బడా స్టార్స్ షారుక్​ ఖాన్, సల్మాన్ ఖాన్ కలిసి కనిపించినప్పడల్లా సినీ ప్రియులు, ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉంటారు. వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటించినా, అవార్డు ఫంక్షన్లలో అలరించినా, యాడ్​లలో కనిపించినా అభిమానులకు పెద్ద పండగే. నిజానికి వీరిద్దరి కాంబో ప్రేక్షకులకు చాలా ఎంటర్‌టైనింగ్ అనిపిస్తుంది. అయితే తాజాగా షారుక్​, సల్మాన్‌ ఫ్యాన్స్‌కు ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే అన్నీ కుదిరితే త్వరలోనే వీరిద్దరినీ ఒకే తెరపై మరోసారి చూడొచ్చు. అది కూడా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రాజెక్టులో.

వాస్తవానికి ఇప్పటి వరకు కరణ్ అర్జున్​, కుచ్ కుచ్ హోతా హై, హమ్ తుమ్హారే హై సనమ్ చిత్రాల్లో కలిసి నటించారు షారుక్, సల్మాన్. ఆ తర్వాత పఠాన్​​ సల్మాన్​ గెస్ట్​ రోల్​, టైగర్ 3లో షారుక్ అతిథి పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సారి వీరిద్దరు కలిసి ఓ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తారని సినీవర్గాలు అంటున్నాయి. షారుక్​ తనయుడు ఆర్యన్ ఖాన్ స్టార్ డమ్ పేరుతో ఓ వెబ్ సిరీస్​ను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా, ఎంటర్ట్మైన్నెంట్ రంగంలో ఉండే వ్యక్తుల జీవితాలు, వారు ఎదుర్కొనే సమస్యలను హైలెట్ చేస్తూ ఆర్యన్ ఈ సిరీస్​ను రూపొందిస్తున్నారు. దీంట్లో షారుక్​, సల్మాన్ కలిసి పని చేసేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆరు ఎపిసోడ్​లుగా ఇది రానుందట.

ఇప్పటికే స్టార్ డమ్ సిరీస్ కోసం దర్శకుడు ఆర్యన్, సల్మాన్ ఖాన్‌ను సంప్రదించారనీ సమాచారం. షారుక్​తో పాటు ఆయన కుటంబంతో ఉన్న అనుబంధం కారణంగా అడగగానే సల్మాన్ ఒప్పుకున్నారట. అయితే ఈ వెబ్​సిరీస్​లో షారుక్ - సల్మాన్ కలిసి కనిపిస్తారా లేదా వేరు వేరు ఎపిసోడ్లలో కనిపిస్తారా అనేది క్లారిటీ లేదు. అలానే షారుక్ కూడా పక్కాగా కనిపిస్తారా అనేది కూడా స్పష్టత లేదు. కానీ సినీ వర్గాలు మాత్రం షారుక్ కూడా కనిపిస్తారని చెబుతున్నాయి. ఇంకా ఈ సిరీస్​లో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, కరణ్ జోహర్, బాబీ దేఓల్​ వంటి పెద్ద స్టార్లు కూడా నటించనున్నారట.

ప్రస్తుతం షారుక్​ ఖాన్ సుజోయ్ ఘోష్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న 'కింగ్' చిత్రంలో తన కూతురు సుహానా ఖాన్​తో కలిసి కనిపించనున్నారు. దీంట్లో అభిషేక్ బచ్చన్ విలన్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక సల్మాన్ ఖాన్ విషయానికొస్తే ప్రస్తుతం బిగ్ బాస్ 18, సికందర్ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికందర్​ చిత్రంలో సల్మాన్ సరసన రష్మికా మందన్నా నటిస్తుండగా, సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

విడుదలకు ముందే దూసుకెళ్తోన్న 'దేవర' - ఆ రికార్డులన్నీ బ్రేక్​! - Devara Movie Records

షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన హీరో రానా - కింగ్ ఖాన్ రియాక్షన్ ఏంటంటే? - Rana Touches Shah Rukh Khan Feet

ABOUT THE AUTHOR

...view details