Ramoji Rao Usha Kiron Movies : సినిమా అనేది కళాత్మాక వ్యాపారం అని నమ్మిన వ్యక్తి రామోజీ రావు గారు. అశ్లీలతకు దూరంగా మంచి వినోదాత్మక, సందేశాత్మక కథ చిత్రాలను నిర్మించాలన్న సంకల్పంతో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేశారు. తన తుదిశ్వాస వరకు అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్న దార్శనికుడు రామోజీ రావు గారు. రెండున్నర దశాబ్దాల కాలంలో ఎంతోమంది ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేశారు.
ఉషా కిరణ్ మూవీస్‌తో సినిమా అంటే తపన ఉన్న డైరెక్టర్లను,నటులనూ, మ్యూజిక్ డైరెక్టర్లను, రచయితలనూ పోత్సహించారు. ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమలో స్టార్ హిరోగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, సినీయర్ హీరో శ్రీకాంత్, దివగంత నటుడు ఉదయ్ కిరణ్ హీరో తరుణ్, దర్శకుడు తేజ, హీరోయిన్ శ్రియా లాంటి ఎంతోమంది నటులను తెలుగు సినిమాకు అందించారు.
అంతేకాదు అంతేకాదు మయూరి ఫిలిం డిస్ర్టిబ్యూటర్స్‌ని ప్రారంభించి కొన్ని వందల తెలుగు చిత్రాలనే కాకుండా, ఇతర భాషా చిత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు దేశంలోని అన్ని భాషా చిత్రాలు రామోజీ ఫిలిం సీటీలో రూపొదిద్దుకుంటున్నాయి. ఇప్పటివరకు కొన్ని లక్షల వేల చిత్రాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరిగాయి.
కథను మాత్రమే విశ్వసించి
తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందించాలనే సంకల్పంతో 1983 మార్చి 2న ఉషా కిరణ్ మూవీస్ సంస్థను ఏర్పాటు చేశారు. 27ఏళ్ల కిందట మెుదలైన ఉషాకిరణ్ మూవీస్ సంస్థ మరే సినిమా నిర్మాణ సంస్థతోనూ పోలిక తీసుకురాలేనిది. తారబలం కాకుండా కేవలం కథను మాత్రమే విశ్వసించి ఇప్పటివరకు దాదాపు 85కు పైగాచిత్రాలను నిర్మించారు.ఈనాడుకు అనుబంధంగా 'సితార' సినిమా వార్తా పత్రిక ప్రారంభమైంది.
1981-82, 1982-83 సంవత్సరాల్లో సితార అవార్డు వేడుకలను నిర్వహించి నటులు, దర్శకులను ప్రోత్సహించారు. కేవలం వార్తాలు, కథనాలు, అవార్డులకే పరిమితం కాకుండా విలువలున్న చిత్రాలను అందించాలని రామోజీ రావు గారు..ఆలోచన చేశారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఉషాకిరణ్ మూవీస్ సంస్థ. ఆ రోజున మార్కెట్‌లో క్రేజ్ ఉన్న ఏ కథనాయకుడైనా టక్కున కాల్షీట్లు ఇచ్చేవారు. కానీ ఆయన మాత్రం తారలను సృష్టించే కథలను నమ్మారు. అలా 1984లో దిగ్గజ డైరెక్టర్ జంధ్యాల గారి డైరెక్షన్లో తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పుడే ఎదిగే ప్రయత్నం చేస్తున్న నరేష్, పూర్ణిమ లీడ్‌రోల్స్‌లో ఎంపిక చేసుకొని 'శ్రీవారికి ప్రేమలేఖ'ని నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో మెుదటి చిత్రం తోనే తెలుగు సినిమాలో తన ముద్ర వేశారు.
యదార్థ ఘటనలతో సినిమాలు - ఆయన అభిరుచే వేరు
కథలనేవి కల్పనల్లోంచి కాదు, జీవితాల్లోంచి పుడతాయని ఉషా కిరణ్ మూవీస్ సంస్థ నిరూపించింది. అందకు ఉదహరణే 'మయూరి' సినిమా. ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలిచి సంచలనం సృష్టించారు. ప్రమాదంలో కాలు పొగొట్టుకొని, కృతిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. 'మయూరి' చిత్రంతోనే జైపుర్ పాదం గురించి దేశంవ్యాప్తంగా ప్రజలకు తెలిసింది. ఒడిశాలో జరిగిన యధార్థ సంఘటనలతో 'మౌనపోరాటం', జాతీయ క్రీడాకారణి అశ్వని నాచప్ప బయోపిక్ 'అశ్వని' వంటి చిత్రాలను నిర్మించి ఆయన అభిరుచి వేరు అని నిరూపించుకున్నారు. 'కాంచన గంగ', 'ప్రతిఘటన', 'నువ్వేకావాలి', 'చిత్రం', 'ఆనందం', 'నచ్చావులే', 'బెట్టింగ్ బంగార్రాజు', 'నువ్విలా' వంటి ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. కేవలం తెలుగు చిత్రాలకే ఉషా కిరణ్ మూవీస్ పరిమితం కాలేదు. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషాల్లో ఇప్పటివరకు 85 చిత్రాలను నిర్మించారు.
సినీ తారల పరిచయం
మంచి చిత్రాలకు ప్రేక్షక ఆదరణే కాదు, అవార్డులు సైతం తలవంచుతాయని రామోజీ రావు గారు నిరూపించారు. శ్రీవారి ప్రేమలేఖకు ప్రభుత్వ పురస్కారాలు వరించాయి. కాంచన గంగ, మయూరి, ప్రతిఘటన, తేజ, మౌనపోరాటం లాంటి చిత్రాలకు నంది అవార్డులు లభించాయి. 'మయూరి'లో నటించిన సుధా చంద్రన్‌కు ఏకంగా జాతీయస్థాయిలో పురస్కారం లభించింది. 'నువ్వే కావాలి'కి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది.
ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటులు ఎంతో మంది ఉన్నారు. శ్రీకాంత్, వినోద్ కుమార్, చరణ్ రాజ్, యమున, జూ. ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్, కల్యాణ్ రామ్, రీమాసేన్ , శ్రియ, జెనీలియా, తనీశ్ ఇలా ఎందరో నటులు పరిచమయ్యారు. మౌనపోరాటంతో గాయని ఎస్. జానకిని సంగీత దర్శకురాలని చేశారు. గాయకులు మల్లికార్జున్ , ఉష, గోపికా పూర్ణిమ లాంటి వారిని శ్రోతలకు పరిచయం చేశారు. చిత్ర నిర్మాణంతోపాటు పంపిణీ విభాగానికి కూడా శ్రీకారం చుట్టారు. మయూరి ఫిల్మ్ డిస్ర్టిబ్యూటర్స్ పేరుతో ఆ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.
బుల్లితెర మరువలేని సీరియల్స్, ప్రొగ్రామ్స్
కేవలం పెద్ద తెరకు మాత్రమే ఆయన పరిమితం కాలేదు. బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. పలు సీరియల్స్ నిర్మించి ఎంతోమందిని స్టార్‌లను చేశారు. భాగవతం, అన్వేషిత, ఎండమావులు, ఆడపిల్ల , నాగాస్ర్తం, అంతరంగాలు వంటి పలు హిట్ ధారవాహికలను అందించారు. పాడుతా తీయగా, జబర్దస్త్, ఢీ వంటి ప్రోగ్రామ్స్‌ని అందించారు.
'ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది'- రామోజీ అస్తమయంపై సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి - Ramoji Rao Passed Away
'తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటం లేని మహారాజు' - Ramoji Rao Passed Away