Ramcharan RC 16 Update : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా బుచ్చిబాబుతో చేయనున్న #RC16 సినిమా జానర్ గురించి చెప్పారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్‌లో భాగంగా ఈ విషయాన్ని చెప్పారు. ఇంకా తనకు ఇష్టమైన సినిమా ఏంటి? హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అనే విషయాలను చెప్పుకొచ్చారు.
"నాకు ఆరెంజ్, రంగస్థలం సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇక మగధీర నా ల్యాండ్ మార్క్ చిత్రం. చాలా మంది ఫ్యాన్స్‌కు కూడా ఈ సినిమా అంటేనే ఇష్టం. అందుకే నేను కూడా ఈ మూవీ పేరే చెబుతాను. అయితే నాకు యాక్షన్ చిత్రాలంటే బాగా ఇష్టం." అని చరణ్ అన్నారు.
Ramcharan Favourite Hero, Heroine : 'థ్రిల్లర్, కామెడీ, ఏ జానర్ సినిమాలు చేస్తారు?' అని అడగగా - "కామెడీ ఎప్పుడూ చేయలేదు కానీ, అయితే బుచ్చిబాబుతో చేయబోయే సినిమా ఈ జానర్‌లోనే ఉంటుంది." అని చెప్పుకొచ్చారు. అలానే తనకు ఇష్టమైన హీరో కోలీవుడ్ స్టార్ సూర్య అని, ఈ తరం హీరోయిన్స్‌లో సమంత అంటే ఇష్టమని తెలిపారు.
'పుస్తకాలా, ఆటలా ' అని మరో ప్రశ్న అడగగా "Who Moved My Cheese పుస్తకం బాగుంటుంది. పుస్తకాలంటే ఇష్టం" అని అన్నారు. ఇంకా సంప్రదాయ దుస్తులంటే ఇష్టమని, ఇతరులకు తానెప్పుడు సూక్తులు చెప్పనని పేర్కొన్నారు.