Ramcharan Doctorate :గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు 'డాక్టర్' రామ్ చరణ్ అయ్యారు. ఆయనకు నేడు (ఏప్రిల్ 13)న చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా గౌరవ డాక్టరేట్ అందించింది. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలకు గుర్తింపు ఈ డాక్టరేట్‌ను ప్రకటించారు. సినీ నిర్మాత, యూనివర్సిటీ ఛాన్సలర్ గణేశ్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం అందజేశారు.
ఇక రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ కంగ్రాజ్యూలేషన్స్ చెప్తున్నారు. తనయుడి ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు పొందినందుకు చెర్రీ తండ్రీ చిరంజీవి ఉప్పొంగిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టి ఆశీర్వదించారు.
"ప్రఖ్యాత వేల్స్ యూనివర్శిటీ రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను అందించింది. ఈ మూమెంట్ ఒక తండ్రిగా నన్ను ఎమోషనలయ్యేలా చేస్తోంది. అంతే కాకుండా నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం. పిల్లలు తమ విజయాలను అధిగమించినప్పుడే ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. లవ్ యూ మై డియర్ డా.రామ్ చరణ్" అంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు