తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

క్రేజీ న్యూస్​ - స్టార్ డైరెక్టర్​తో రామ్ పోతినేని నయా మూవీ! - Ram Pothineni New Movie - RAM POTHINENI NEW MOVIE

Ram Pothineni New Movie : ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఓ స్టార్ డైరెక్టర్​తో మూవీ చేయనున్నారన్న న్యూస్ వైరల్​గా మారింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్ ?

Etv BRam Potineni
Ram Potineni (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 1:53 PM IST

Ram Pothineni New Movie : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిజల్ట్స్​తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు. ఆయన లుక్స్​, యాక్టింగ్​కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఏ పాత్ర నటిస్తే ఆ పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చుకోవడం రామ్ స్పెషాలిటీ.

గత ఏడాది ఆయన నుంచి వచ్చిన 'స్కంద' యావరేజ్ టాక్ అందుకున్నప్పటికీ, అందులోని రామ్ పాత్ర బాగా క్లిక్ అయ్యింది. అయినా అటు రాయలసీమ యాసలో, ఇటు తెలంగాణ యాసలో రెండు విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. అయితే ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్​తో బిజీగా ఉన్న రామ్​ తాజాగా ఇప్పుడు హరీశ్​ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్​తో ఓ మూవీ చేయనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. డైరెక్టర్ హరీశ్​ శంకర్​తో చేయనున్న మూవీ భారీ బడ్జెట్​తో రూపొందనుందని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితమే హరీశ్​- రామ్ కలిసినట్లు, అప్పుడే ఈ మూవీ స్టోరీ లైన్ హరీశ్​ చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని హరీశ్​గాని, రామ్ గాని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రామ్ ప్రస్తుతం 'డబుల్ ఇస్మార్ట్' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీని పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు.

అయితే చాలా కాలం క్రితమే ఈ షూటింగ్ ప్రారంభమైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్నాళ్లు షూటింగ్​కు బ్రేక్ పడింది. రీసెంట్​గా కొన్ని రోజుల క్రితమే ముంబయిలో మళ్లీ ఈ షూటింగ్ ప్రారంభమయింది. ఈ మూవీని ఛార్మి కౌర్ పూరీ కనెక్ట్స్ బ్యానర్​లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

మరోవైపు రామ్ నెట్​ఫ్లిక్స్​ వేదికగా రానున్న ఓ వెబ్ సిరీస్​లోనూ నటించనున్నట్లు సమాచారం అందింది. ఈ వార్త నిజమైతే ఈ వెబ్​ సిరీస్​తో రామ్ ఓటీటీ తెరపై అడుగుపెట్టనున్నట్టు అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. నెట్​ఫ్లిక్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

'డబుల్ ఇస్మార్ట్' క్రేజీ అప్డేట్- రామ్​ ఫ్యాన్స్​లో జోష్ నింపిన పూరి - Double Ismart Shooting

'డబుల్​ ఇస్మార్ట్' వరల్డ్​లోకి రామ్​ ఎంటర్​.. ఫుల్ లుక్ ఛేంజ్​!

ABOUT THE AUTHOR

...view details