Rakul Preet Wedding Video: బాలీవుడ్ స్టార్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్- జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. గోవాలోని ఓ ప్రముఖ హోటల్లో ఆనంద్ కరాజ్, సింధీ స్టైల్లో వీరి వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రకుల్‌కు ఇండస్ట్రీ ఫ్రెండ్ మంచు లక్ష్మీ ఈ పెళ్లిలో హాజరై సందడి చేశారు.
ఈ క్రమంలోనే పెళ్లి వీడియో కూడా వచ్చేసింది. ఇందులో రకుల్ ప్రీత్- జాకీ భగ్నానీ ఎంత సంతోషంగా ఉన్నారో కనిపిస్తోంది. ఓ సినిమాలో భారీ బడ్జెట్ సాంగ్ రేంజ్లో ఈ వెడ్డింగ్ షూట్ చేశారు. ఫ్రెండ్స్, గెస్ట్స్ కేరింతల మధ్య రకుల్ హుషారుగా స్టెప్పులేస్తూ జాకీ దగ్గరకు వెళ్తుంది. దండలు మార్చుకునే సమయంలో రకుల్ అల్లరి ఆకట్టుకుంటుంది. ఇక బ్రైడల్ ఎంట్రీ, హల్దీ ఈవెంట్, కపుల్ స్పెషల్ డాన్స్ ఇలా ప్రతీ ఒక్కటీ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి మీరు ఆ వీడియో చూసేయండి.
మోదీ స్పెషల్ విషెస్:ప్రధాని నరేంద్ర మోదీ రకుల్ ప్రీత్- జాకీ జంటను ఆశీర్వదించారు. పీఎంఓ ఆఫీస్ నుంచి సపరేట్గా ఓ లెటర్‌ను పంపుతూ కొత్త కపుల్‌కు విషెస్ చెప్పారు.