తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వెడ్డింగ్ డెస్టినేషన్​లో మార్పులు - ఆయన కోసమే రకుల్, జాకీ నిర్ణయం!

Rakul Preet Singh Wedding Venue : బాలీవుడ్‌ క్యూట్​ కపుల్​ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. అయితే వీరి వివాహ వేదిక మార్పుపై వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Rakul Preet Singh Wedding Venue
Rakul Preet Singh Wedding Venue

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 9:17 PM IST

Updated : Jan 31, 2024, 10:33 PM IST

Rakul Preet Singh Wedding Venue :బీటౌన్​ కపుల్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 22న పెళ్లి పీటలెక్కనున్నట్లు నెట్టింట పలు వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి వెడ్డింగ్ డెస్టినేన్​ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తొలుత విదేశాల్లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోవాలకున్న ప్లాన్‌లో ఉన్న ఈ కపుల్​ ఆ తర్వాత తమ నిర్ణయం మార్చుకుని గోవాలో పెళ్లి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

"రకుల్‌- జాకీ తొలుత మిడిల్‌ ఈస్ట్‌లో వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఇండియాలో చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. చివరి నిమిషంలో ఈ వేదిక మార్చడం కష్టమే అయినప్పటికీ దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారు" అంటూ రకుల్‌, భగ్నానీ సన్నిహిత వర్గాలు తమకు చెప్పినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది.

ఫారిన్​లో వివాహాలు చేసుకోవాలనుకునే భారతీయ యువ జంటలకు ప్రధాని మోదీ ఇటీవలే కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని విదేశాల్లో ఎందుకు ప్రారంభిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. భారత్‌లో ఒక్కసారైనా డెస్టినేషన్‌ వెడ్డింగ్ చేశారా? అని దేశంలోని సంపన్న కుటుంబాల వారిని ప్రశ్నించారు. 'మేక్​ ఇన్​ ఇండియా' లాగే 'వెడ్‌ ఇన్‌ ఇండియా' అనే పరంపర ప్రారంభం కావాలని ప్రధాని పిలుపినిచ్చారు.

Rakul Preet Singh Movies List : ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే - 'గిల్లి' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్, 2013లో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ సక్సెస్​తో నటిగా మంచి మార్కులు కొట్టేసిన రకుల్​, ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌, కోలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె కీలక పాత్ర పోషించిన 'ఇండియన్‌ 2' (భారతీయుడు 2) విడుదలకు సిద్ధమవుతోంది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నట్లు 2021లో ప్రకటించింది. అప్పటి నుంచి పలు ఈవెంట్లలో సందడి చేసిన ఈ కపుల్​ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు.

Rakul Preet Singh Birthday : రకుల్​కు బాయ్​ఫ్రెండ్ సర్​ప్రైజ్​.. తన స్పెషల్​ పర్సన్​ అంటూ..

NMACC : బాయ్​ఫ్రెండ్​తో రకుల్​ సందడి.. కూతురితో కాజోల్​ క్యూట్​ పోజు.. రష్మిక బ్లాక్​ లవ్​

Last Updated : Jan 31, 2024, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details