ETV Bharat / state

యువకులతో క్రికెట్ ఆడిన మాజీ మంత్రి మల్లారెడ్డి - బ్యాటింగ్ చేసి అందరినీ ఉత్సాహపరిచిన వీడియో వైరల్ - MALLAREDDY PLAYS CRICKET

యువకులతో సరదాగా క్రికెట్ ఆడిన మాజీ మంత్రి మల్లారెడ్డి - తుర్కపల్లి క్రికెట్​ టోర్నమెంట్ ఫైనల్​ మ్యాచ్​కు ముఖ్య అతిథిగా హాజరైన మల్లన్న

MLA Mallareddy Plays Cricket
MLA Mallareddy Plays Cricket (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2024, 10:47 PM IST

Updated : Nov 24, 2024, 10:56 PM IST

MLA Mallareddy Plays Cricket Video : పాలమ్మినా, పూలమ్మినా, కష్టపడ్డా ఈ డైలాగ్​ విన్నవెంటనే గుర్తుకు వచ్చేది మాజీ మంత్రి మల్లారెడ్డినే. తన మాట, ఆట పాట ద్వారా అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు ఆయన. ఈ విధంగా సోషల్ మీడియాలో ఆయన ఏదో విధంగా ట్రెండ్ అవుతుంటారు. తాజాగా ఆయన కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్​ అవుతుంది.

బ్యాట్​పట్టి క్రికెట్​ ఆడిన ఎమ్మెల్యే మల్లారెడ్డి : ఏడు పదుల వయసులో యువకులతో కలిసి క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్​కు టాస్ వేసి మ్యాచ్​ను మాజీ మంత్రి సీహెచ్​. మల్లారెడ్డి ప్రారంభించారు. యువకులు వారం రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తుండగా ఆదివారం చివరి రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్​కు ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మ్యాచ్​ను ప్రారంభించి క్రీడాకారులతో పరిచయం చేసుకుని కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడాలని సూచించారు. అనంతరం తుర్కపల్లి గ్రామంలోని గోన మైసమ్మ ఆలయ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

అట్లుంటది మల్లారెడ్డితోని - మనవరాలి సంగీత్​లో అదరగొట్టే డ్యాన్స్

వైరల్​ వీడియో : మల్లారెడ్డి బతుకమ్మ డ్యాన్స్ - మీరూ చూడండి - Malla Reddy Dance with Students

Last Updated : Nov 24, 2024, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.