ETV Bharat / spiritual

అత్రి అగస్త్యుల సంవాదం, ద్వాదశి వ్రత మహత్యం- కార్తిక పురాణం 24వ ఛాప్టర్ ఇదే! - KARTHIKA PURANAM

సకల పాపహరణం కార్తిక పురాణ శ్రవణం- ఇరవై నాలుగవ అధ్యాయం మీకోసం!

Karthika Puranam
Karthika Puranam (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 1:41 AM IST

Karthika Puranam 24th Day : పరమ పవిత్రమైన కార్తిక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తిక పురాణం కాలక్షేపంలో భాగంగా ఈ కథనంలో ద్వాదశి వ్రత మహత్యం, అంబరీషోపాఖ్యానం గురించి తెలుసుకుందాం.

అత్రి అగస్త్యుల సంవాదం
వశిష్ఠులవారు జనకమహారాజుతో "ఓ జనకా! అత్రిమహాముని అగస్త్యులవారికి కార్తిక వ్రత ప్రభావమును తెలియచేసే మరియొక కథను కూడా చెప్పి ఉన్నాడు. ఆ కథను కూడా నేను నీకు చెబుతాను శ్రద్దగా వినుము" అని చెబుతూ ఇరవైనాలుగవ రోజు కథను ప్రారంభించాడు.

అత్రిమహాముని అగస్త్యుల వారితో "ఓ కుంభసంభవా! కార్తిక వ్రత ప్రభావమును ఎంత వివరించినను తనివి తీరదు. కార్తిక వ్రత మహత్యమును తెలియచేసే మరొక కథను చెబుతాను వినుము" అని చెప్పసాగెను.

ద్వాదశి వ్రత మహత్యం
గంగా గోదావరి నదులలో స్నానము చేసిన ఎంతటి ఫలము కలుగునో, కార్తిక శుద్ధ ద్వాదశి నాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేసెడి వారికి కూడా అంతే ఫలము కలుగును. కార్తిక శుద్ధ ద్వాదశి రోజున చేసే సత్కర్మలకు వేయి రేట్లు అధిక ఫలము కలుగుతుంది. ఆ ద్వాదశి వ్రతం చేయు విధానము చెబుతాను వినుము" అంటూ చెప్పసాగెను.

దశమితో మొదలై ద్వాదశితో పూర్తయ్యే వ్రతం
కార్తిక శుద్ధదశమి రోజున మధ్యాహ్నము పూట మాత్రమే భోజనము చేసి, ఆ ప్రక్క రోజు అనగా ఏకాదశి రోజున అన్నపానీయాలు ముట్టకుండా ఉపవాసము చేసి, ప్రక్కరోజు ద్వాదశి ఘడియలు వచ్చిన వెంటనే భోజనము చేయవలెను. ఈ ద్వాదశి వ్రత మహాత్యమును గురించి వివరించే ఇతిహాసము ఒకటి చెబుతాను వినుము" అంటూ చెప్పసాగెను.

అంబరీషోపాఖ్యానం
పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతను పరమ భాగవతోత్తముడు. ద్వాదశి వ్రత ప్రియుడు. ప్రతి ద్వాదశికి తప్పకుండా వ్రతమును చేస్తూ ఉండేవాడు. ఒకసారి ద్వాదశి రోజున ద్వాదశి ఘడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి. అందుచేతనే అంబరీషుడు పెందలకడనే వ్రతమును ముగించి, బ్రాహ్మణ సమారాధన చేయదలచి అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని అతిథి కోసం ఎదురు చూస్తూ ఉండసాగెను.

అతిథి అంటే!
ఇక్కడ అతిథి అంటే పిలవకుండా భోజన సమయానికి వచ్చే మహానుభావుడు అని అర్ధం. ఇంతలో కోపస్వభావుడైన దూర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు. అంబరీషుడు ఆ మునికి ఎదురు వెళ్లి ఎన్నో రకాలుగా సత్కరించి, భోజనానికి ఆహ్వానించి ద్వాదశి ఘడియలు ముగిసే సమయం సమీపిస్తుండడంతో దూర్వాస మహర్షి ని త్వరగా స్నానం చేసి రమ్మని ప్రార్ధించాడు.

అంబరీషునికి కఠిన పరీక్ష
అతిథికి భోజనం పెడితే తప్ప తాను నీరు కూడా తాగరాదు కదా మరి. అదే సమయంలో ద్వాదశి ఘడియలు ముగిసిపోకుండా భోజనం చేయడం అంతే అవసరం. లేనిచో ఏకాదశి వ్రతమునకై చేసిన ఉపవాసం నిష్ఫల మగును. ద్వాదశి ఘడియలు వెళ్లిపోయాక భోజనం చేస్తే భగవంతునికి కోపం వస్తుంది. అంతేకాక పూర్వజన్మలో చేసిన పుణ్యములు కూడా నశిస్తాయి. ద్వాదశి ఘడియలలో అతిధి రాకముందే భోజనం చేస్తే, అతిథికి కోపం వస్తుంది. ఇప్పుడు అంబరీషుడు పని అడకత్తెరలో పోకచెక్కలా అయింది.

పండితులతో సమావేశం
చివరకు అంబరీషుడు బ్రాహ్మణుని శాపం విష్ణువును ఆశ్రయిస్తే పోతుంది కానీ ద్వాదశి ఘడియలు వెళ్లాక భోజనం చేస్తే ఏకాదశి వ్రత ఫలం లభించకపోగా, హరిభక్తిని విడిచి పెట్టిన వాడినవుతానని భావించి, ఇక దూర్వాసుడు రాకపోయినా ద్వాదశి వెళ్లేలోపు భోజనం చేయడానికి నిశ్చయించుకుని, ఎందుకైనా మంచిదని పండితులను సంప్రదించాడు.

పండితులతో చర్చించిన అంబరీషుడు
పండితులతో అంబరీషుడు "ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి రోజున ఏకాదశి కావడం చేత నేను కటిక ఉపవాసం ఉన్నాను. ఈరోజు ద్వాదశి ఘడియలు చాలా స్వల్పంగానే ఉన్నాయి. ఏకాదశి ఉపవాసం ఉన్న నేను ద్వాదశి ఘడియలు వెళ్లిపోకుండా భోజనం చేయాలనుకున్న సమయంలో నా ఇంటికి దూర్వాస మహర్షి వచ్చారు. ఆయనను నేను భోజనానికి ఆహ్వానించాను. ఆయన అందుకు సమ్మతించి స్నానం కోసం నదికి వెళ్లారు. ఇప్పటివరకు తిరిగి రాలేదు. అతిథికి భోజనము పెట్టకుండా గృహస్తు భోజనం చేయకూడదు కదా. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటి పోవు చున్నవి. నేను ఇప్పుడు ఏమి చేయాలి? మహర్షిని వదిలి ద్వాదశి ఘడియలలో భోజనం చేయవచ్చునా? లేదా వ్రత భంగం చేసి మహర్షి వచ్చేవరకు వేచిఉండాలా? ఏది ధర్మమో తెలియజేయండి" అని కోరాడు.

మధ్యేమార్గం సూచించిన పండితులు
ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశీలించి, తమలో తాము చర్చించుకొని, దీర్ఘంగా ఆలోచించి "మహారాజా సమస్త ప్రాణుల ఉదరము నందు ఆకలిని పుట్టించే జఠరాగ్ని రూపంలో అగ్నిదేవుడు ఉండి, వారు భుజించిన ఆహారమును జీర్ణము అయ్యేలా చేసి శరీర ఇంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు. కావున శరీరమునకు శక్తిని కలుగజేసే వాడు అగ్నిదేవుడు. అందుకే ఆయన దేవతలందరి కంటే అధికముగా పూజ్యుడై నాడు. భోజనం చేసి ఆకలిని తీర్చుకుని అటువంటి అగ్నిదేవుని గౌరవించవలెను. అదే సమయంలో ఒక గృహస్తు తన ఇంటికి వచ్చిన అతిధి ఏ జాతి వాడైనా సరే, అతనికి పెట్టకుండా భోజనం చేయరాదు. ఇక్కడ మీ ఇంటికి వచ్చిన అతిథి మహా తపశ్శాలి, సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహర్షి. అటువంటి మహానుభావునికి భోజనం పెట్టకుండా నీవు భోజనం చేస్తే నీకు మహా పాపం కలుగుతుంది. అంతే కాదు దూర్వాసుడంతటి గొప్ప మహర్షిని అవమానించిన పాపం కూడా కలుగుతుంది". అని పండితులు ఇంకను అంబరీషుడితో చెప్పడం కొనసాగించారు.

ఈ విధంగా కొనసాగుతున్న అత్రి అగస్త్య మునుల సంవాదమును ఇక్కడివరకు చెప్పి వశిష్ఠులవారు ఇరవై నాలుగవ రోజు కథను ముగించారు. ఇతి స్కాంద పురాణే! కార్తిక మహాత్మ్యే చతుర్వింశాధ్యాయ సమాప్తః ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.