ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు కోరుకున్న వ్యక్తితో పెళ్లి ఫిక్స్​! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!! - DAILY HOROSCOPE

నవంబర్ 25వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2024, 2:25 AM IST

Horoscope Today November 25th 2024 : నవంబర్ 25వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి రోజు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఎలాంటి ప్రతికూలతలు లేని మంచి రోజు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఈ రోజు మిమ్మల్ని లక్ష్మీ దేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. విజహసమైన సంపద ప్రవాహానికి సంతోషిస్తారు. వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. కుటుంబ సంతోషం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ రోజు వృత్తి పరంగా అద్భుతంగా రాణిస్తారు. సదస్సులలో, చర్చలలో పాల్గొని మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. వ్యాపారులకు ప్రయాణాలు లబ్ది చేకూరుస్తాయి. కుటుంబంలో వివాదాలు జరిగే అవకాశం ఉంది. రచయితలకు, సాహితీవేత్తలకు శుభ సమయం నడుస్తోంది. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. జీర్ణకోశానికి సంబంధించిన అస్వస్థతలు ఇబ్బంది పెట్టవచ్చు. సూర్యాష్టకం పఠించడం శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో అనిశ్చితి, సందిగ్ధావస్థలో ఉంటారు. ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొంటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కుటుంబ సభ్యులతో స్థిరాస్తులూ, వారసత్వపు ఆస్తుల గురించిన చర్చలు వాయిదా వెయ్యండి. లేకుంటే విచారం తప్పదు. వీలైనంతవరకూ ఈ రోజు ప్రయాణం వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోబుట్టువులతో అనుబంధం దృఢ పరచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. స్నేహితుల సహకారంతో ఆర్థిక లబ్ధి పొందుతారు. వృత్తి పరంగా ఎదగడానికి మీరు చేసిన అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. విహారయాత్రలకు వెళ్తారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు రావడానికి సమయం పట్టవచ్చు. నిరాశ, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. కోర్టు వ్యవహారాలలో నిర్ణయం మీకు అనుకూలంగానే రావచ్చు. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాస్తుతి పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మీ సర్దుకుపోయే స్వభావం, పరిస్థితులకనుగుణంగా మసలుకునే తీరుతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. మీ కోపం, పరుష పదాల కారణంగా సన్నిహితులతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వీలైనంత వరకు ఈ రోజు శాంతంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలోనూ ఇబ్బందికర పరిస్థితి ఉండవచ్చు. ఎవరితోనూ ఘర్షణ పడకండి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఇది అద్భుతమైన రోజు. వృత్తి పరంగా ఈ రోజు అనేక అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పనితీరుని ఉన్నతాధికారులు అభినందిస్తారు. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి తారాబలం అనుకూలంగా ఉంది. కోరుకున్న వ్యక్తితో త్వరలో వివాహం జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో కృషితోనే సత్ఫలితాలు ఉంటాయి. మీ ప్రియమైనవారు, సన్నిహితుల కోసం సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి సంబంధిత, వ్యాపార లావాదేవీలు, మేధో పరమైన విషయాలకు అనుకూలమైన సమయం. సమావేశాలు, చర్చల్లో రాణిస్తారు. మీ వాదనను అందరు సమర్థిస్తారు. కుటుంబ పరంగా ఈ రోజు అనుకూలం కాదు. కొన్ని అనుకోని సంఘటనలు కుటుంబ శాంతిని దెబ్బ తీస్తాయి. బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. నవగ్రహ ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనైతిక పథకాలు, ఆలోచనలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఏర్పడకుండా చూసేందుకు కోపాన్ని, మాటలను వీలైనంత అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రతికూల ఆలోచనలు, విరక్తితో రోజంతా గడిచిపోతుంది. ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. ఆధ్యాత్మిక సాధనతో ప్రశాంతత చేకూరుతుంది. అభయ ఆంజనేయస్వామి ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా వుంటుంది. సినీరంగం, కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. విభిన్నమైన ఆలోచనా ధోరణితో అందరినీ ఆకట్టుకుంటారు. కళాకారులు, రచయితలు నైపుణ్య ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీరామనామ జపం మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.