ETV Bharat / entertainment

'పుష్ప' నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్- బన్నీ, శ్రీలీల స్టెప్పులు చూశారా? - PUSHPA KISSIK SONG

పుష్ప నుంచి కిసిక్ సాంగ్ రిలీజ్- మీరు విన్నారా?

Pushpa Kissik Song
Pushpa Kissik Song (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 8:13 PM IST

Pushpa Kissik Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరెక్కుతున్న 'పుష్ప 2' సినిమా నుంచి 'కిస్సిక్' సాంగ్ రిలీజైంది. ఆదివారం చెన్నైలో 'వైల్డ్ ఫైర్' పేరుతో మేకర్స్​ ఓ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్​కు హీరో బన్నీ సహా, రష్మిక మంధన్నా, శ్రీలీల హాజరై స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. కాగా, ఇదే ఈవెంట్​లో మేకర్స్​ 'కిస్సిక్' సాంగ్​ను రిలీజ్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్​లో బన్నీతో కలిసి డ్యాన్స్ క్వీన్ శ్రీలీల స్టెప్పులేసింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో పాటపై ఆత్రుత పెంచగా, మేకర్స్ ఆదివారం ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు రకీబ్ ఆలమ్ లిరిక్స్ అందించగా, సింగర్స్​ లోతిక, సుభాషిని ఆలపించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఈ పాట కోసం ప్రత్యేకమైన సెట్ ఏర్పాటు చేశారు. బ్యాక్ ​గ్రౌండ్ లుక్ అంతా గ్రాండ్​గా ఉంది. సెటప్​ చూస్తే, సినిమాలో ఓ పార్టీ ఈవెంట్​లో ఈ పాట రానున్నట్లు అర్థమవుతోంది. ఇక బన్నీ- శ్రీలీల స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లలున్నాయి. ఈ పాటతో ఫ్యాన్స్​కు తొలి పార్ట్​లోని 'ఊ అంటావా, ఊఊ అంటావా' పాట వైబ్స్ గుర్తుచేశారు డైరెక్టర్ సుకుమార్.

ఓవర్సీస్ రికార్డులు

యూఎస్​ ప్రీ బుకింగ్స్​లో పుష్ప దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతను సాధించి ఓవర్సీస్​లో పుష్ప మేనియా ఎలా ఉందో చూపించింది. ఇప్పటికే అక్కడ 1. 25 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్​ దాటేసింది. దీంతో బుకింగ్స్​లో అతి తక్కువ సమయంలో ఈ మార్క్ అందుకున్న రికార్డును ఖాతాలో వేసుకుంది. సుమారు 45 వేలకి పైగా టికెట్స్ అమ్ముడయ్యాయట. ఈ విషయాన్ని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, ఈ సినిమాపై ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో రష్మిక మంధన్నా హీరోయిన్​గా నటిస్తోంది. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.