Nidhhi Agerwal Rajasaab :సోషల్ మీడియాలో రీసెంట్గా హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సంబంధించిన ఓ ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అది ది రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన లీక్డ్ ఫొటో అంటూ ప్రచారం సాగింది. తాజాగా వైరల్‌గా మారిన ఆ ఫొటో గురించి క్లారిటీ ఇచ్చింది నిధి.
ఆ ఫొటోకు, రాజాసాబ్ చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. "అది ది రాజా సాబ్ లీక్డ్ ఫొటో కాదు. రీసెంట్గా నేను చేసిన ఒక యాడ్ షూట్ ఫొటో అది. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను త్వరలోనే మీకు ఇస్తాం. నన్ను నమ్మండి. మీ ఎదురు చూపులకు తగిన విలువ దొరుకుతుంది." అని ఆమె పేర్కొంది.
కాగా, ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రమే 'ది రాజా సాబ్'. హారర్, రొమాంటిక్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ ఇప్పటి వరకు పోషించని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తున్నారు.
2025 ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన విజువల్స్‌ను ఇటీవలే నిర్మాత భూషణ్‌కుమార్ చూసి, ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సన్నివేశాలు హాలీవుడ్ మూవీ హ్యారీ పోటర్‌ను తలపించేలా ఉన్నాయంటూ సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేశారు.
Nidhhi Agerwal Upcoming Movies : ఇకపోతే తెలుగులో నిధి అగర్వాల్ సరైన హిట్ అందుకుని చాలా కాలమే అవుతోంది. అశోక్ గల్లా 'హీరో' చిత్రం తర్వాత మళ్లీ ఆమె ఇంత వరకు తెలుగు ఆడియెన్స్ ముందుకు రాలేదు. ప్రస్తుతం ది రాజా సాబ్ చిత్రంతో పాటు పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లులో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అలానే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయితే, మంచి విజయాలు దక్కుతాయని నిధి ఆశిస్తోంది.
ప్రెగ్నెన్సీ అని తెలిసి చాలా కంగారు పడ్డా - సరిగ్గా నిద్ర కూడా లేదు : రాధికా ఆప్టే
కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ - రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?