Actress Debuted At 16 Years : సినిమా ఇండస్ట్రీలో ఏ అదృష్టం ఎవరినీ, ఎప్పుడు వరిస్తుందో చెప్పలేం. కొందరు సినిమా అవకాశాల కోసం చాలా ఏళ్లపాటు నిరీక్షించాల్సి వస్తుంది. ఇంకొందరు వచ్చిన ఛాన్స్‌ను కూడా సద్వినియోగం చేసుకోలేకపోతారు. వీరిని పక్కన పెడితే కొందరు చాలా చిన్న వయస్సులో బాలీవుడ్‌లోకి ప్రవేశించి, తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అనుకోని కారణాలతో సిల్వర్ స్క్రీన్‌కి దూరమయ్యారు. ఒకప్పటి బాలీవుడ్ క్వీన్ కరిష్మా కపూర్ ఈ కోవకే చెందుతారు.
బాలీవుడ్‌లోని ప్రముఖ కపూర్ కుటుంబం నుంచే కరిష్మా వచ్చారు. స్టార్ కిడ్‌గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మూడు దశాబ్దాల క్రితం ఆమె బాలీవుడ్‌ని షేక్ చేశారు. దీంతో ఆమెకు ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అందరి సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే సినిమాలకు టాటా చెప్పేశారు. కొన్నాళ్లకు తిరిగివచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాలు సక్సెస్ రాలేదు.
కరిష్మా జర్నీ
16 ఏళ్ల వయస్సులో కరిష్మా సినిమాల్లోకి వచ్చారు కరిష్మా కపూర్. 1991లో 'ప్రేమ్ ఖైదీ' సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, ఆ తర్వాత అమీర్ ఖాన్ సరసన 'రాజా హిందుస్థానీ', సల్మాన్ ఖాన్‌తో 'జుడ్వా', షారుక్ ఖాన్‌తో 'దిల్ తో పాగల్ హై' వంటి హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు.
1990స్లో ఆమెకు గోల్డెన్ పీరియడ్ నడిచిందని చెప్పవచ్చు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అప్పట్లో పీక్‌లో ఉన్న ముగ్గురు ఖాన్‌ల జోడీగా కరిష్మా నటించారు. గోవిందతో 'రాజా బాబు', 'హీరో నంబర్ 1', 'కూలీ నంబర్ 1', 'హసీనా మాన్ జాయేగీ' వంటి హిట్‌లు అందించారు.
2003లో సంజయ్ కపూర్ అనే పారిశ్రామికవేత్తను కరిష్మా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత క్రమంగా ఆమె సినిమాలకు దూరమయ్యారు. 2012లో 'డేంజరస్ ఇష్క్'తో రీఎంట్రీ ఇచ్చారు. కానీ అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత 2024 నెట్‌ఫ్లిక్స్ మూవీ 'మర్డర్ ముబారక్'తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది.
ఫ్యామిలీ నో చెప్పినా సినిమాల్లోకి!- 22 ఏళ్ల కెరీర్లో రెండే హిట్లు- కానీ ఆస్తి మాత్రం రూ.కోట్లలో!