Rajamouli Nickname : గ్లోబల్‌గా అందరికీ ఆయన రాజమౌళిగా పరిచయం. కానీ సినీ ప్రియులు జక్కన్న, మిస్టర్ పర్ఫెక్ట్, ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పిలుస్తుంటారు. అయితే ఆయన్ను ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా? ఇక ఇదే విషయాన్ని కీరవాణి చిన్న తనయుడు శ్రీ సింహా రివీల్ చేశారు.
"రాజమౌళిని మేము బాబా అని పిలుస్తాము. ఆయన మాకు వరుసకు బాబాయ్ అవుతారు. అందుకే మేము షార్ట్‌కట్ గా బాబా అని పిలుస్తాము. ఆయనకు కూడా అలా పిలిస్తే చాలా ఇష్టం. నన్ను బాబా అనే పిలవండి అంటూ ఆయనే మాకు చాలా సార్లు చెప్పారు. అందుకోసమే మేమంతా ఆయన్ను బాబా అనే పిలుస్తాము" అంటూ శ్రీ సింహా తెలిపారు. ఇది విన్న ఫ్యాన్స్ జక్కన్నకు తన ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు. మేము కూడా ఇక బాబా అని పిలుస్తామని సరదాగా అంటున్నారు.
షూటింగ్స్ సమయంలో స్ట్రిక్ట్‌గా కనిపంచే ఆయన ఆఫ్‌స్క్రీన్‌లో ఎంతో సరదాగా కనిపిస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. ఓ వెడ్డింగ్ ఈవెంట్లో తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. అందులో ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.