ETV Bharat / sports

రోహిత్, జైస్వాల్ జోడీ మళ్లీ ఫెయిల్- అయినా భారీ రికార్డ్ కొట్టారుగా! - RANJI TROPHY 2025

రెండో ఇన్నింగ్స్​లోనూ ముంబయి ఓపెనర్లు ఫెయిల్- ఆయినా ఈ రికార్డు కొట్టిన రోహిత్, జైస్వాల్

Rohit Sharma Yashasvi Jaiswal
Rohit Sharma Yashasvi Jaiswal (Source : AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 24, 2025, 3:25 PM IST

Rohit Sharma Yashasvi Jaiswal Ranji : జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన భారత స్టార్‌ ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ రెండో ఇన్నింగ్స్​లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తొలి ఇన్నింగ్స్​లో 3 పరుగులకే పెవిలియన్ చేరిన రోహిత్, ఈ ఇన్నింగ్స్​లో నిలదొక్కుకున్నాడనుకునేలోపే 28 పరుగుల వద్ద ఔటయ్యాడు.

మరోవైపు జైస్వాల్ కూడా 26 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో భారీ అంచనలాతో దిగిన ఈ జోడీ మరోసారి నిరాశపర్చింది. అయితే ఈ మ్యాచ్​లో విఫలమైనా, రోహిత్ - జైస్వాల్​ జోడీ ఓ అద్భుత రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అదేంటంటే?

ఏకైక జోడీ
ప్రస్తుతం అంతర్జాతీయ టెస్టుల్లో టీమ్ఇండియా నుంచి రోహిత్ శర్మ- జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్నారు. తాజాగా ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు రంజీలోనూ జట్టు ఇన్నింగ్స్​ ప్రారంభించారు. ఈ క్రమంలో ఒకే రంజీ జట్టు తరపున ఓపెనర్లుగా బరిలోకి దిగిన భారత తొలి టెస్టు ఓపెనింగ్ జోడీగా రికార్డు సృష్టించారు.

రోహిత్ 17ఏళ్ల తర్వాత
అలాగే, రోహిత్ శర్మ 17ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడిన భారత తొలి కెప్టెన్​గానూ నిలిచాడు. అలా చివరగా మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే తాను కెప్టెన్​గా ఉన్నప్పుడు ఆడాడు. 2008లో తాను భారత్ జట్టుకు కెప్టెన్​గా ఉన్న అనిల్ కుంబ్లే మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.