Pushpa 2 Sreelela :పాన్ఇండియా స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో రానున్న భారీ బడ్జెట్ మూవీ 'పుష్ప 2'. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతన్నా కొద్దీ ఆసక్తి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఇచ్చారు. యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
శ్రీలీల ఎనర్జిటిగ్గా స్టెప్ వేస్తున్న ఫొటో ఒకటి రిలీజ్ చేశారు. 'పుష్ప -2 టీమ్‌లోకి డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు స్వాగతం పలుకుతున్నాం. కిసిక్ పాట సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. ఇది డ్యాన్స్, మ్యూజికల్‌గా హిట్ కానుంది' అని మేకర్స్ పోస్ట్‌కు రాసుకొచ్చారు. కాగా, కొన్నిరోజులుగా స్పెషల్ సాంగ్‌లో బన్నీతో కలిసి ఏ హీరోయిన్ కలిసి స్టెప్పులేస్తుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూశారు. అయితే శ్రీలీల ఓకే అయ్యిందని తెలిసినా, అధికారికంగా మాత్రం ఇప్పుడే కన్ఫార్మ్ అయ్యింది. ఇక బిగ్ స్క్రీన్‌పై బన్నీ- శ్రీలీల చేసే ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఫొటో లీక్
అయితే ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఫొటో ఒకటి రీసెంట్గా లీక్ అయ్యింది. ఇందులో హీరో అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ క్యాస్టూమ్‌లో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ అంతా ఓ పార్టీ సెటప్లాగా ఉంది. బ్లాక్ ఔట్ఫిట్లో శ్రీలీల క్యూట్ అండ్ హాట్‌గా కనిపిస్తుంది. అయితే ఈ ఫొటో ఎలా లీక్ అయ్యిందో తెలియదు. కానీ, నిమిషాల్లోనే ఈ ఫొటో ఇంటర్నెట్ను షేక్ చేసేసింది. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.