Pushpa 2 Records: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకుంటూ అదరగొడుతోంది. సినిమా విడుదలై 10రోజులైన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు తగ్గలేదు. పదో రోజు (శనివారం) 'పుష్ప 2' సినిమా అన్ని భాషల్లో కలిపి ఏకంగా రూ.100కోట్లు వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీంతో 10వ (సెకండ్ వీకెండ్ కూడా) రోజు రూ.100 కోట్ల మార్క్ అందుకున్న భారతీయ తొలి చిత్రంగా 'పుష్ప 2' అరుదైన రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే 'జవాన్', 'పఠాన్', 'స్త్రీ 2', 'బాహుబలి 2', 'గదర్ 2' వంటి సినిమాల బాక్సాఫీస్ రికార్డులను సైతం 'పుష్ప 2' అధిగమించింది.
అక్కడా రికార్డే
పది రోజుల్లో పుష్ప హిందీలో రూ.507.50 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. దీంతో అత్యంత వేగంగా హిందీ వెర్షన్ రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన ఇండియన్ సినిమాగా పుష్ప- 2 రికార్డులకెక్కింది. అలాగే అమెరికాలోనూ పుష్ప మేనియా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 12.3 మిలియన్లు కలెక్షన్లు అందుకుంది. చిత్రం విడుదలై పది రోజులు అవుతున్నా జోరు చూపిస్తూ ముందుకెళ్తోంది. ఇక వరల్డ్‌వైడ్‌గా ఇప్పటివరకు ఈ సినిమా రూ.1100 కోట్లకుపైనే వసూల్ చేసింది. కాగా, డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషలు, 12వేల స్క్రీన్లలో పుష్ప సినిమా రిలీజైంది.