The Raja Saab Fan India Glimpse :రెబల్‌స్టార్ ప్రభాస్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్' మూవీ నుంచి మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ గ్లింప్స్‌ను అభిమానుల కోసం విడుదల చేశారు. 'ఫ్యాన్ ఇండియా గ్లింప్స్'గా నెట్టింట రిలీజైన ఈ గ్లింప్స్ ప్రస్తుతం ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. దాన్ని మీరూ చూసేయండి.
ఓ బైక్‌పై కూల్‌గా వచ్చిన ప్రభాస్, అక్కడే దాన్ని ఆపి చేతిలో ఓ బొకే పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారు. అక్కడే ఉన్న ఓ కారు అద్దంలో చూసుకుని దిష్టి తీసుకుంటారు. ఎంతో స్టైలిష్ లుక్‌లో ప్రభాస్ కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో గ్లింప్స్ చూసిన అభిమానులు వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇకే ఇదే గ్లింప్స్‌లో మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం పాన్ఇండియా లెవెల్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభాస్‌తో పాటు మాళవిక మోహనన్, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా కార్తీక్ పళని, ఎడిటర్ గా కోటగిరి వేంకటేశ్వర రావు పని చేస్తున్నారు. హార్రర్ కామెడీగా తెరకెక్కతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.