తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'స్పిరిట్' ఫస్ట్​డే కలెక్షన్ రూ.150 కోట్లు పక్కా!- ప్రభాస్ ఇమేజ్​తో ఇది సాధ్యమే'- సందీప్ వంగా - Prabhas Sandeep Spirit - PRABHAS SANDEEP SPIRIT

Prabhas Sandeep Spirit: పాన్ఇండియా స్టార్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ షూటింగ్ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సందీప్ ఈ సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు.

Prabhas Sandeep Spirit
Prabhas Sandeep Spirit

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 6:47 PM IST

Prabhas Sandeep Spirit:'యానిమల్' సక్సెస్​తో ఉత్సాహంగా ఉన్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇక నెక్ట్స్ రెబల్​ స్టార్ ప్రభాస్​తో చేయబోయే స్పిరిట్​పై ఆయన దృష్టి పెట్టారు. ఈ క్రమంలో రీసెంట్​గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను 'స్పిరిట్' సినిమా విజయం పట్ల కాన్ఫిడెంట్​గా మాట్లాడారు. ఇప్పటికే సినిమా స్ట్రిప్ట్ 60 శాతం పూర్తైందన్న ఆయన సినిమా ఫస్ట్​ డే కలెక్షన్​ అప్పుడే అంచనా వేసేశారు.

దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కనున్న 'స్పిరిట్' సినిమా ప్రభాస్ స్టార్​డమ్​తో దేశవ్యాప్తంగా ఓపెనింగ్ రోజే (ఫస్ట్​ డే) రూ.150 కోట్లు వసూల్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభాస్​తో మూవీ అనగానే రూ.300+ కోట్లు కూడా ఇన్వెస్ట్​ చేయడానికి ముందుకొచ్చే ప్రొడ్యుసర్లు ఉన్నారని సందీప్ అన్నారు. ఈ నేపథ్యంలోనే భారీ బడ్జెట్​తో రూపొందనున్న స్పిరిట్, ప్రభాస్ ఇమేజ్​తోనే టీజర్, ట్రైలర్, ఆడియో రిలీజ్, ప్రీ ప్రమోషన్స్​తోపాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్​తోనే పూర్తి బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశం ఉందని సందీప్ అభిప్రాయపడ్డారు.

ఇక 2024 నవంబర్​ లేదా డిసెంబర్​లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సందీప్ అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సందీప్ అన్నారు. స్పిరిట్​కు ముందే ప్రభాస్​తో ఒక హాలీవుడ్ రీమేక్ చేసే అవకాశం వచ్చినా, ఈ సినిమా కోసం దానిని ఒప్పుకోలేదన్నారు. ఇక ఇప్పటికే యానిమల్ సినిమాతో సందీప్ మార్కెట్ పెరిగింది. ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.900 కోట్ల మార్క్ అందుకుంది.ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్​తో సినిమా సందీప్ స్థాయిని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి యానిమల్ సిక్వెల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్​తో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న 'కల్కి 2898 AD' మే 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల సినిమా పోస్ట్​పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

డార్లింగ్ ఫ్యాన్స్​కు షాక్- కల్కి పోస్ట్​పోన్!- కానీ, రిలీజ్​కు ముందు OTTలో స్పెషల్ వీడియో - Kalki Movie Postponed

'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan

ABOUT THE AUTHOR

...view details