తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రశాంత్ నీల్​ నెక్ట్స్​ లైనప్​ : ముందు ప్రభాస్​ - తర్వాత తారక్​! - సలార్ పార్ట్​ 2 షూటింగ్

Salaar Part 2 Shouryanga Parvam : దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇటీవల సలార్ మొదటి భాగంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సలార్ రెండో భాగం ఎప్పుడు తెరకెక్కించనున్నారనే విషయంపై కొన్ని వివరాలు తెలిశాయి.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 10:09 AM IST

Updated : Jan 20, 2024, 10:27 AM IST

Prabhas Salaar Part 2 Shouryanga Parvam : దర్శకుడు ప్రశాంత్ నీల్ రీసెంట్​గా 'సలార్ పార్ట్ వన్ సీజ్​ ఫైర్'​ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.700కోట్లకుపైగా వసూళ్లను సాధించి మంచి లాభాలను అందుకుంది. అయితే ప్రశాంత్ నీల్ ప్లాన్ ప్రకారం సీజ్​ ఫైర్​ తర్వాత జూనియర్ ఎన్టీఆర్​తో మూవీ చేయాలని అనుకున్నారట! అలానే 'కేజీయఫ్ పార్ట్ 3' కూడా ఉంటుంది అని ఆ మధ్యలో హింట్ ఇచ్చారు.

అయితే ఇప్పుడీ ఆర్డర్ మారబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. 'సలార్ 2' శౌర్యంగపర్వం వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. ఎందుకంటే బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అనే క్వశ్చన్​ మార్క్​ రెండో భాగంపై బాగా హైప్​ను పెంచింది. కానీ సీజ్​ఫైర్​ బాగానే ఉన్నప్పటికీ బాహుబలి స్థాయిలో శౌర్యంగపర్వంపై బజ్ తీసుకురాలేదు! కాబట్టి ప్రస్తుతం ఆరు వందల కోట్లకుపైగా వసూళ్లతో ఊపుమీదున్న సలార్​ రెండో భాగం ఇప్పుడే తీసేస్తే ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారట.

పైగా తారక్ ప్రస్తుతం 'దేవర 1' తర్వాత హృతిక్​ 'వార్ 2'తో బిజీ అవుతారు. అది కంప్లీట్ అయ్యేలోగా కొరటాల శివ 'దేవర 2' స్క్రిప్ట్​తో సిద్ధంగా ఉంటారు. ఇదంతా పూర్తయ్యేసరికి కనీసం ఒక ఏడాది అయినా పడుతుంది. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం 'కల్కి 2898 ఏడి', 'ది రాజా సాబ్' పనులు మార్చి నెలాఖరులోపు పూర్తవుతాయి. సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' ఫైనల్ వెర్షన్ రెడీ అవ్వడానికి చాలానే సమయం పట్టేట్టు ఉంది. కాబట్టి ఇదంతా చూస్తే 'సలార్ 2' శౌర్యంగ పర్వమే ముందు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో ప్రస్తుతం సెట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్​కు పని చేసిన టీమ్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి నిర్మాణం ఆలస్యం కాకపోవచ్చు. ఇక 'సలార్'​ కంప్లీట్​ అయ్యాక ఎన్టీఆర్​తో, ఆ తర్వాత యశ్​(కేజీయఫ్ 3)తో ప్రశాంత్ నీల్​ రావొచ్చు. ఇంకా ప్రశాంత్ నీల్ లిస్ట్​లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు. మరి ఈయనతో సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

'అది నన్ను బాగా దెబ్బతీసింది - ఆ విషయం వల్ల డిప్రెషన్​లోకి వెళ్లాను'

'అందుకే రణ్​బీర్​ను కొట్టాను - ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు'

Last Updated : Jan 20, 2024, 10:27 AM IST

ABOUT THE AUTHOR

...view details