తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్ లైనప్​లో చిన్న మార్పు - ఆ స్టార్ డైరెక్టర్​ సినిమా వెనక్కి! - Prabhas Movies Lineup - PRABHAS MOVIES LINEUP

Prabhas Movies Lineup : కల్కితో భారీ సక్సెస్ అందుకున్న ప్రభాస్​ నెక్ట్స్​ లైనప్​లో చిన్న మార్పులు చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Prabhas Movies Lineup (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 2:00 PM IST

Prabhas Movies Lineup : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 సక్సెస్​తో విజయోత్సాహంలో ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రూ.1100 కోట్ల(Prabhas Kalki 2898 AD Collections) దిశగా పరుగులు పెడుతోంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫారెన్​ వెకేషన్​లో ఎంజాయ్ చేస్తున్నారట! త్వరలోనే దాన్ని ముగించుకుని స్వదేశానికి తిరిగి రానున్నారు.

కానీ మరోవైపు ప్రేక్షకులు మాత్రం ప్రభాస్​ నుంచి ఏ సినిమా వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ వర్గాలు నుంచి అందిన సమాచారం ప్రకారం డార్లింగ్ తిరిగి రాగానే మిగిలిపోయిన మారుతి రాజాసాబ్​ను పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఎలాగైనా ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదలచేయాలని నిర్ణయించుకున్నారట.

దీని తర్వాత ప్రభాస్​ మరో రెండు చిత్రాలకు సైన్ చేశారు. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగా స్పిరిట్. రెండోది హను రాఘవపూడి ఫౌజి. ఈ రెండింటిలో ముందుగా స్పిరిట్ మొదలు పెట్టాలనేది ప్రణాళిక. కానీ ఇప్పుడా ఆ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్​, స్క్రిప్ట్ వర్క్ ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభాస్ లైనప్​లో చిన్న మార్పులు ఉండొచ్చని తెలిసింది. స్పిరిట్ వెనక్కి వెళ్లి ఫౌజీ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందట. లేదంటే రెండు చిత్రాలను ఒకే సమయంలో షూట్ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Prabhas Spirit Movie : స్పిరిట్ సినిమా విషయానికొస్తే పూర్తి వైలెన్స్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కనుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్​గా కనిపించబోతున్నారట. ఇక హను రాఘవపూడి సినిమా ఒక పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో మృణాల్ ఠాకూర్​ను హీరోయిన్​గా తీసుకునే ఛాన్స్ ఉంది. 1940ల బ్యాక్ డ్రాప్​లో బ్రిటీష్ కాలం నాటి సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్​ జవాన్ పాత్రలో నటించనున్నారట(Prabhas Hanu Raghavapudi Movie). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.

టికెట్​ బుకింగ్స్​లో 'కల్కి' ఆల్​టైమ్​ రికార్డ్​ - ఎన్ని అమ్ముడుపోయాయంటే?

రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్ - ఈ లిస్టులో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఉన్నారా? - WHO IS BEST DIRECTOR IN TOLLYWOOD

ABOUT THE AUTHOR

...view details