Prabhas Marriage : గత దశాబ్ద కాలంగా డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న విషయం ఏదైనా ఉందంటే అది ప్రభాస్ పెళ్లి. ఇప్పటికే ప్రభాస్ వయసు 40 దాటి చాలా కాలం అయిపోయింది. బాహుబలి సినిమా తర్వాత చాలా మంది అమ్మాయిల ఫోటోలు వైరల్ అయ్యాయి కానీ ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ప్రభాస్ ఏ ఈవెంట్లకు గెస్ట్‌గా వెళ్లినా ఆయన్ను తప్పకుండా ఈ ప్రశ్న అడగడం అందరికీ అలవాటు అయిపోయింది. గతంలో ప్రభాస్‌తో కలిసి 3 సినిమాల్లో నటించిన అనుష్కతో పెళ్లి జరగనుందని రూమర్లు వినిపించాయి.
మరీ ముఖ్యంగా మిర్చి సినిమా క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్ 'ఇప్పటికే బాగా లేట్ అయింది డార్లింగ్' అనే మాటను అయితే చాలామంది ఫ్యాన్స్ తెగ వాడేశారు. ప్రభాస్ కావాలనే ఆ సినిమాలో ఆ డైలాగ్‌తో ఏదో హింట్ ఇచ్చారంటూ కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ప్రభాస్, అనుష్క ఇద్దరూ ఆ పుకార్లకు చాలా సార్లు చెక్ పెట్టి తాము మంచి స్నేహితులమని చెప్పారు.
అయితే మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి వార్త ఒకటి బయటకు వచ్చింది. అందులో పెళ్లిపై డార్లింగ్ స్పందించినట్లు ఉంది. కానీ ఇది ఇప్పుడిది కాదు. గతంలో ఓ సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన పెళ్లి గురించి మాట్లాడినది. 'నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు తనకు నాకు ఏమైన మనస్ఫర్థలు వస్తే అభిమానులు ఏమీ సాల్వ్ చేయలేరు కదా. నన్ను వదిలేయండి. ఇలానే ఉండనివ్వండి' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనే నెట్టింట్లో చక్కర్లు కొడుతూ తిరుగుతోంది.