Kalki Pre Release Event : మరో వారం రోజుల్లో అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ కల్కి సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్ సినిమాపై మరింత భారీ అంచనాలు పెంచాయి. హాలీవుడ్ రేంజ్లో మూవీ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే కల్కి టీమ్ మెంబర్స్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన స్పెషల్ కార్ బుజ్జితో ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాన్ని తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు మూవీ మెయిన్ టీమ్ రంగంలోకి దిగబోతుంది. మరి కొద్ది గంట్లలో ముంబయి వేదికగా భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. ఇప్పటికే కల్కి మెయిన్ టీమ్ అంతా ముంబయి చేరుకున్నారు. విలక్షన హీరో రానా ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఇకపోతే సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. దీంతో ముంబయిలోని ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఈవెంట్ కోసం వేదిక దగ్గరకు చేరుకుంటున్నారు. అలానే ఈ ఈవెంట్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవుతారని సమాచారం అందుతోంది. అయితే ఈ ఈవెంట్‌ను వైజయంతి నెట్ వర్క్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే లైవ్ ఇస్తున్నారు. మరి ముంబయిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి మీరు చూడాలంటే ఈ కింది వీడియో లింక్‌లో చూసేయండి.