Prabhas Deepika Padukone Kalki 2898 AD :కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా మరో మూడు రోజుల్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలోని ప్రధాన తారగాణం అంతా కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెలతో పాటు ప్రొడ్యూసర్లు స్వప్న, ప్రియాంకా దత్‌లు సినిమా గురించి, అందులో స్టార్ల పెర్ఫార్మెన్స్ గురించి సరదా ముచ్చట్లు పంచుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కమల్ హాసన్ కల్కి సినిమా సెట్‌లో తనకు బాగా నచ్చిన అంశాన్ని బయటపెట్టారు. "అక్కడ కెమెరాలు ఎన్ని ఉన్నాయి. స్టాఫ్ ఎంత మంది ఉన్నారని కాదు. వాళ్లంతా చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నారు. చాలా సెట్స్‌లో ఆ వాతావరణం మనకు కనిపించదు. శబ్దాలు అనేవి వస్తుంటాయి. కానీ ఈ సెట్‌లో ప్రతి ఒక్కరూ చాలా క్రమశిక్షణగా ఉన్నారు. డైరక్టర్ నాగ్ అశ్విన్ కూడా క్యాజువల్‌గానే మాట్లాడారు. ఒక్కొక్కసారి ఆయనలో ఏదో మాట్లాడుకుంటూ గొణుక్కుంటున్నా మాకు వినిపించేది. అంత సైలంట్‌గా సెట్‌ను మెయిన్‌టైన్ చేశారని" ప్రశంసించారు.
దీపికను ఆటపట్టించిన ప్రభాస్ - ఈ ఫన్నీ వీడియో చూశారా? - Kalki 2898 AD Movie - KALKI 2898 AD MOVIE
Prabhas Deepika Padukone Kalki 2898 AD : కల్కి 2898 AD సినిమా సెట్‌లో తనకు బాగా నచ్చిన విషయాన్ని బయటపెట్టారు కమల్ హాసన్. అలానే ఇదే ఇంటర్వ్యూలో అమితాబ్, ప్రభాస్దీపికను సరదాగా ఆటపట్టించారు. పూర్తి వివరాలు స్టోరీలో
kalki (source ETV Bharat)
Published : Jun 24, 2024, 12:11 PM IST