Kalki 2898 AD Bujji and Bhairava Trailer : తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ పాన్ వరల్డ్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 ఎడి. మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌లో చేస్తూ మూవీటీమ్ హంగామా చేస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా ఆయనకు తోడుగా బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ రోబోటిక్ కారు కూడా సినిమాలో కనిపిస్తుంది. బుజ్జి - భైరవల మధ్య నడిచే ట్రాక్ సినిమాకే హైలెట్‌గా నిలవనుందని, సినీ లవర్స్‌ను కట్టిపడేయనుందని మూవీటీమ్ చెబుతోంది.
Kalki 2898 AD Animated Series :అలానే ఈ సినిమా రిలీజ్‌కు ముందే యానిమేషన్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. మే 31న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ప్రిల్యూడ్స్ పేరుతో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యానిమేషన్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యానిమేషన్‌లోనూ యాక్షన్ డోస్ అదిరిపోయింది. భైరవ, బుజ్జిల బాండింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుందని ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్ధమవుతోంది.