Polimera 2 Producer Complaint : తనకు ప్రాణహాని ఉందంటూ పొలిమేర 2 నిర్మాత గౌరవ కృష్ణప్రసాద్ కంప్లైంట్ చేశారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, అతడి టీమ్‌పై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే రక్షణ కల్పించాలని కోరారు.
"వంశీ నందిపాటి, అతడి టీమ్ మోసపూరిత కార్యకలాపాలు చేస్తోంది అని 2023 నవంబర్ 27న తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో కంప్లైంట్ చేశాను. మరి ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో తెలీదు. అందుకే న్యాయం కోసం మళ్లీ కంప్లైంట్ చేస్తున్నాను. ప్రస్తుతం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాను. ప్రసన్న కుమార్ ఛాంబర్ పవర్‌ను దుర్వినియోగం చేసి, నన్ను బెదిరిస్తున్నారు. నాతో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. వంశీ నందిపాటి, అతడి టీమ్ చంపేస్తామని బెదిరించారు.
నేను తెలుగు రాష్ట్రాల్లో పొలిమేర 2 డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను ఓ అగ్రీమెంట్ మేరకు వంశీ నందిపాటికి ఇచ్చాను. సినిమా రిలీజై, బ్లాక్ బస్టర్ అయింది. కానీ, ఇప్పటికీ నాకు వాటి లాభాల్లో వాటాను ఇవ్వలేదు. సినిమా రిలీజ్ టైమ్‌లో సెక్యూరిటీ పరంగా నేను సంతకం చేసిన ఖాళీ చెక్కులు, పలు లెటర్ ప్యాడ్స్, బాండ్ పేపర్స్ వాటిని ఇప్పుడు ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. పైగా నాతో మాట్లాడకుండానే పొలిమేర 3ను అనౌన్స్ చేశారు. ఇలాంటి పరిస్థితి మరో ప్రొడ్యూసర్‌కు రాకూడదు. ఫిల్మ్ ఛాంబర్ నాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాను." అని కంప్లైంట్లో పేర్కొన్నారు.