NTR Hrithik Roshna War 2 Shooting :బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ విషయం ప్రకటించినప్పటి నుంచి హృతిక్, ఎన్టీఆర్ కలిసి షూటింగ్‌లో పాల్గొన్న అప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. అయితే ఇప్పటికీ అభిమానుల ఆశ తీరనుంది. ఒక 10 రోజుల యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ తాజాగా ముంబయికి చేరుకున్నారు. ఏప్రిల్ 12 నుంచి షూటింగ్ సెట్స్‌లో తారక్ అడుగుపెట్టనున్నారట. అయితే ముంబయికి చేరుకోగానే మీడియా ఎన్టీఆర్‌ను చుట్టుముట్టేసింది. ఫ్యాన్స్ అంతా ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. కానీ తారక్ దూరం నుంచే వాళ్లను చూసి ఫొటోలకు పోజులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇక ఎన్టీఆర్ నటించనున్న ఈ యాక్షన్ సీన్స్ సినిమాకు చాలా ముఖ్యమైన సీన్స్ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి హృతిక్, తారక్ ఇద్దరూ వంద రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ 10 రోజుల షూటింగ్ తర్వాత మళ్లీ తన షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ ముంబకు వస్తారా లేదా ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఆ కాల్ షీట్స్ ఇచ్చారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం కోసం హృతిక్, తారక్ ఇద్దరూ వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది తేలాల్సి ఉంది. మూవీలో ఎన్టీఆర్ ఒక రా ఏజెంట్‌గా కనిపించనున్నారట. హృతిక్‌తో పాటు ఎన్టీఆర్ పాత్రకు కూడా సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.
కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ చివరకి దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అందుకే హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి దేవర సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్‌తో పాటు కీలక పాత్రలో సైఫ్ అలీ ఖాన్‌ను తీసుకున్నారు. వార్ 2 ప్రస్తుత షెడ్యూల్ పది రోజులు పూర్తి కాగానే మళ్లీ దేవర షూటింగ్‌లో పాల్గొంటారు ఎన్టీఆర్.
ముంబయి 'వార్'లో దిగిన ఎన్టీఆర్ - పది రోజులు అక్కడే! - War 2 Shooting - WAR 2 SHOOTING
NTR Hrithik Roshna War 2 Shooting : యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ముంబయికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్‌లో పాల్గొననున్నారని తెలిసింది.
ముంబయి వార్‌లో దిగిన ఎన్టీఆర్ - పది రోజులు అక్కడే!
Published : Apr 11, 2024, 4:06 PM IST
|Updated : Apr 11, 2024, 4:57 PM IST
Last Updated : Apr 11, 2024, 4:57 PM IST