Nawazuddin Siddiqui Rautu Ka Raaz Movie OTT : ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజైన ఓ క్లైమ్ థ్రిల్లర్ మూవీ మళ్లీ ఈ విషయాన్ని నిరూపించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? రౌతు కా రాజ్. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఓ మర్డర్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం జూన్ 28న జీ5 ఓటీటీలో రిలీజైంది. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 10 కోట్ల వాచ్ మినట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మూవీటీమ్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
కథేంటంటే? - రౌతు అంటే ఊరి పేరు. రాజ్ అంటే రహస్యం. 15 ఏళ్లుగా ఎలాంటి క్రైమ్‌లు జరగని రౌతు కీ బేలి ఊరిలో అనుమానస్పదంగా ఓ మహిళ మృతదేహం కనపడుతుంది. అంధుల పాఠశాలలో మహిళా వార్డెన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం ఆ ఊరిలో సంచలనంగా మారుతుంది. దీంతో పోలీస్ అధికారులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తారు. అలా ఆ ఊరి పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ దీపక్ నేగి (నవాజుద్దీన్ సిద్ధిఖీ), ఇన్‌స్పెక్టర్ దిమ్రి (రాజేష్ కుమార్) కలిసి ఈ కేసును ఎలా ఛేదించారు?, ఈ దర్యాప్తులో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేదే సినిమా కథ. ఈ మర్డర్ మిస్టరీకి కామెడీని జోడించి దర్శకుడు ఆనంద్ సూరాపూర్ తెరకెక్కించారు.