తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గరం గరం'గా సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్​ - విన్నారా? - Saripodhaa Sanivaaram First Single - SARIPODHAA SANIVAARAM FIRST SINGLE

Saripodhaa Sanivaaram First Single : నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఈ సందర్భంగా మూవీటీమ్​ ఓ సాంగ్​ను రిలీజ్ చేసింది. అది శ్రోతలను ఆకట్టుకునేలా డిఫరెంట్ ఫీల్​ అండ్​ వైబ్​తో సాగుతోంది.

Source ETV Bharat
Saripodhaa Sanivaaram First Single (Source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 1:34 PM IST

Saripodhaa Sanivaaram First Single: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. దీంతో మూవీటీమ్ తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

'గరం గరం యముడయో, శివమెత్తే శివుడయో, నరం నరం బిగువయో' సాగే ఈ పాటలో హీరో పాత్రను వర్ణిస్తూ సాగింది. డిఫరెంట్ ఫీల్​ అండ్​ వైబ్​ను ఇస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ వాయిస్ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ సాంగ్​లో అక్కడక్కడా నాని రగ్గ్‌డ్ లుక్ లో కనిపించారు. మొత్తంగా ఈ ఫస్ట్ సింగిల్ ద్వారా తన మూవీ థీమ్ చెప్పెందుకు డైరెక్టర్ ప్రయత్నం చేశారు.

Saripodhaa Sanivaaram Cast and Crew : కాగా, సినిమాలో ఎస్‌జే సూర్య విలన్​గా నటిస్తున్నారు. మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్, పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలను నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమానూ నిర్మిస్తోంది. చాలా రోజుల క్రితమే మూవీ ఫస్ట్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. నాని, సూర్యలను చాలా పవర్‌ఫుల్​గా చూపించారు. నాని క్లాస్, మాస్ కలగలపిన లుక్​లో కనిపించనున్నారు. ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్​గా నటిస్తోంది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అంటే సుందరానికి చిత్రం తర్వాత నాని – వివేక్ కాంబో నుంచి రాబోతున్న సినిమా కావడం వల్ల మంచి అంచనాలే ఉన్నాయి. ఆగ‌ష్టు 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇకపోతే నాని ఈ మధ్య కాలంలో భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గతేడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్స్ అందుకున్న నాని ఈసారి సరిపోదా శనివారం అంటూ వస్తున్నారు. ఈ చిత్రం తర్వాత సాహో, ఓజీ ఫేమ్ సుజీత్​తో ఓ యాక్షన్ డ్రామా, బలగం ఫేమ్ వేణు యెల్దండితో ఓ ఫ్యామిలీ డ్రామా చేయనున్నారు.

సాఫ్ట్‌వేర్‌ వదిలి స్టార్​ డైరెక్టర్‌గా - కొరటాల గురించి ఈ విషయాలు తెలుసా? - Happy Birthday Koratala Siva

లాస్ట్ స్టేజ్​లో షూటింగ్- అయినా రిలీజ్​పై నో క్లారిటీ- ఫ్యాన్స్​ ఫుల్ వెయిటింగ్! - Tollywood Upcoming Releases

ABOUT THE AUTHOR

...view details