తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మోక్షజ్ఞ సినిమా షూట్​ షురూ అయ్యేది అప్పుడే!

మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ సినిమా షూటింగ్​ డీటెయిల్స్ ఇవే!

Prasanth Varma Nandamuri Mokshagna Teja movie
Prasanth Varma Nandamuri Mokshagna Teja movie (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Nandamuri Mokshagna Teja Prasanth Varma Movie : నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. తన తొలి సినిమాను హను-మాన్ వంటి బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి సినిమా ఎలా ఉండబోతుందా అని నందమూరి అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది.

అయితే, ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు మూవీ టీమ్ రెడీ అయినట్లు సమాచారం అందుతోంది. మూవీ ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, చిత్రాన్ని డిసెంబర్ 2న లాంఛ్​ చేయాలని ప్లాన్ చేస్తోందట. డిసెంబర్ 2న క్లాప్ కొట్టి రెగ్యులర్ షూట్‌కు వెళ్లేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ షెడ్యూల్ ప్రీపేర్ చేస్తున్నారట.

ఈ సినిమాతోనే బాలీవుడ్ భామ రవీనా టాండన్ కూతురు రషా తథానీ హీరోయిన్​గా పరిచయం కానుందనే టాక్ వినిపిస్తోంది. ప్రతినాయకుడిగా రానా పేరు అనుకుంటున్నట్లు టాక్. సినిమాను 2025 సెకండ్ హాఫ్​లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. గ్రాఫిక్స్ కూడా భారీగా ఉండేలా స్పెషల్ ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. తన వారసుడి తొలి సినిమాలో బాలయ్య బాబు కూడా చిన్న కేమియో రోల్ చేస్తారని, ఆ పాత్ర సినిమాను నెక్స్ట్ లెవెల్​కు తీసుకెళ్లేలా చేస్తుందని అంటున్నారు.

ఈ చిత్రాన్ని లెజెండ్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ బ్యానర్​పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె ఎం.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇతిహాసాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతోంది. బాలయ్య విజన్‌కు అనుగుణంగా, చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మోక్షజ్ఞ నటన, ఫైట్లు, డ్యాన్స్‌ల్లో శిక్షణ తీసుకుని ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారట.

దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ మధ్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ "అద్భుతమైన కథల బంగారు గనిలాంటి మన ఇతిహాసాల స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందుతోంది. నేను ప్రారంభించిన సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగానే దీన్ని తీస్తున్నాను. మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్​ చేయడం గొప్ప గౌరవం, పెద్ద బాధ్యత. బాలయ్య నాపైన, నా కథపైన ఉంచిన నమ్మకానికి ప్రత్యేక కృతజ్ఞతలు" అని అన్నారు.

'అందుకే గ్లామరస్ పాత్రలకు దూరం- ఆ ఒక్క వీడియోనే కారణం!'

60 కోట్ల విలువైన వజ్రం చోరీ - ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన తమన్నా క్రైమ్ థ్రిల్లర్​

ABOUT THE AUTHOR

...view details