ETV Bharat / business

సేఫ్టీలో 5-స్టార్​ రేటింగ్​ ఉన్న కార్​ కొనాలా? టాప్​-10 మోడల్స్​ ఇవే! - 5 STAR RATING CARS

మీ ఫ్యామిలీ కోసం బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న టాప్​-10 కార్స్ ఇవే!

family car
family car (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 5:48 PM IST

5 Star Rating Cars : మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? సేఫ్టీ పరంగా ఎలాంటి ఢోకా ఉండకూడదా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో 'భారత్​ న్యూ కార్​ అసెస్మెంట్ ప్రోగ్రామ్'​ (BNCAP) ద్వారా 5-స్టార్ రేటింగ్ పొందిన టాప్​-10 కార్లపై ఓ లుక్కేద్దాం రండి.

1. Mahindra XUV 3X0 : ఈ మహీంద్రా కారును 2024 ఏప్రిల్​లో అప్డేట్ చేశారు. ఫ్రెష్ డిజైన్​తో పాటు, లేటెస్ట్ ఫీచర్లు ఎన్నింటినో దీనిలో పొందుపరిచారు. సేఫ్టీ పరంగా కూడా ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. పెద్దవారితోపాటు, చిన్నపిల్లలు ప్రయాణించడానికి అనువుగా ఈ కారును తీర్చిదిద్దారు. ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్​లో ఈ మహీంద్రా కారు బీఎన్​సీఏపీ 5-స్టార్ రేటింగ్ పొందింది. అందువల్ల కుటుంబంతో కలిసి భద్రంగా ప్రయాణించడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుందని చెప్పవచ్చు.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (29.36/32)
  • ఛైల్డ్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ - 5 స్టార్​ (43/49)

ఈ మహీంద్రా కారులో స్టాండర్డ్​గా 6 ఎయిర్​బ్యాగ్​లు ఉంటాయి. బ్లైండ్ వ్యూ మోనిటర్​తో సహా 360 డిగ్రీ కెమెరా ఉంటుంది. హిల్​ హోల్డ్​ & హిల్​ డిసెంట్ కంట్రోల్​, ట్రాక్షన్ కంట్రోల్​, రోల్​-ఓవర్ మిటిగేషన్​ సహా ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ కంట్రోల్​ (ఈఎస్​సీ) ఉంటుంది. కనుక కొండ ప్రాంతాల్లో కూడా ఈ కారును సులువుగా డ్రైవ్ చేయవచ్చు. పార్క్​ చేయవచ్చు. ఈ కారులో 3-పాయింట్​ సీట్​బెల్ట్​లు ఇచ్చారు. పైగా అన్ని సీట్లకు సీట్​ బెల్ట్​ రిమైండర్స్​ ఉంటాయి. అన్ని వీల్స్​కు డిస్క్​ బ్రేక్​లు ఉంటాయి. ఈ మహీంద్రా కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్​, అటానమస్ బ్రేకింగ్, లేన్​ కీప్ అసిస్ట్ లాంటి అడ్వాన్స్​డ్​ డ్రైవర్ అసిస్టెంట్​ సిస్టమ్​ (ADAS) ఉంది.

Mahindra XUV 3X0 Price : మార్కెట్లో ఈ మహీంద్రా కారు ధర సుమారుగా రూ.7.79 లక్షల నుంచి రూ.15.49 లక్షల వరకు ఉంటుంది.

2. Tata Nexon : ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలని అనుకునేవారికి టాటా నెక్సాన్ మంచి ఛాయిస్ అవుతుంది. ఎందుకంటే టాటా కార్స్ అంటేనే సేఫ్టీకి పెట్టింది పేరు. ఈ టాటా కార్స్​ భద్రతాపరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా అద్భుతంగా ఉంటాయి. వాస్తవానికి మహీంద్రా ఎక్స్​యూవీ 3X0కు మార్కెట్లో ఉన్న ప్రధాన పోటీదారుగా టాటా నెక్సాన్​ ఉంది. ఈ టాటా నెక్సాన్​ పెద్దలు, పిల్లలు అందరూ ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. దీనికి కూడా భారత్​ ఎన్​సీఏపీ 5 స్టార్ రేటింగ్ ఉంది.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (29.41/32)
  • ఛైల్డ్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ - 5 స్టార్​ (43.83/49)

టాటా నెక్సాన్ కారులో 6 ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్​, ఏబీఎస్​ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్​ ఛైల్డ్ సీట్​ యాంకరేజ్​, రియర్ పార్కింగ్ సెన్సార్స్​ ఉంటాయి. ఇక హయ్యర్​ ఎండ్​ నెక్సాన్​లో అయితే 360 డిగ్రీ కెమెరా, బ్లాండ్ వ్యూ మోనిటర్​, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్​, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. అయితే ఈ టాటా నెక్సాన్ కారులో ADAS లేదు.

Tata Nexon Price : మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ కారు ధర సుమారుగా రూ.8 లక్షల నుంచి రూ.15.50 లక్షల వరకు ఉంటుంది.

3. Tata Punch EV :​ 2024లో లాంఛ్ అయిన టాటా పంచ్ ఈవీలో రెగ్యులర్ పంచ్ కారులోని సేఫ్టీ కిట్​ కంటే మెరుగైన ఎక్విప్​మెంట్​ను పొందుపరిచారు. వాస్తవానికి ఈ కారు 5 స్టార్ రేటింగ్​తో పాటు, హయ్యెస్ట్ సేఫ్టీ స్కోర్​ కూడా సాధించింది. కనుక ఇది పెద్దలు, చిన్న పిల్లలు అందరూ భద్రంగా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (31.46/32)
  • ఛైల్డ్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ - 5 స్టార్​ (45/49)

ఈ కారులో 6 ఎయిర్​బ్యాగ్స్​, 360 డిగ్రీ కెమెరా, ఈఎస్​సీ, ఎలక్ట్రానిక్​ పార్కింగ్​ బ్రేక్​ విత్ ఆటో హోల్డ్​, బ్లైండ్​ స్పాట్​ వ్యూ మోనిటర్​, హిల్ హోల్డ్​ కంట్రోల్​, హిల్ డిసెంట్ కంట్రోల్ ఉన్నాయి.

Tata Punch EV Price :​ మార్కెట్లో ఈ టాటా పంచ్ ఈవీ కారు ధర సుమారుగా రూ. 9.99 లక్షల నుంచి రూ.14.29 లక్షల వరకు ఉంటుంది.

4. Tata Curvv : మంచి కాంపాక్ట్ ఎస్​యూవీ కొనాలని అనుకునేవారికి టాటా కర్వ్​ అద్భుతంగా ఉంటుంది. ఈ కారు యూనిక్ డిజైన్​తో, 5 స్టార్ రేటింగ్​తో వస్తుంది.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (29.50/32)
  • ఛైల్డ్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ - 5 స్టార్​ (43.66/49)

కారులో స్టాండర్డ్​గా 6 ఎయిర్​బ్యాగ్స్​, రియర్ పార్కింగ్ సెన్సార్స్​, ఐసోఫిక్స్​ ఛైల్డ్ సీట్​ మౌంట్స్​, ఈఎస్​సీ ఉంటాయి. ఇంకా హయ్యర్ వేరియంట్లలో అయితే, 360 డిగ్రీ కెమెరా విత్ బ్లైండ్​ వ్యూ మోనిటర్​, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, టీపీఎంఎస్​, లెవల్-2 ADAS, లేన్ కీపింగ్ అసిస్ట్​, అడాప్టివ్ క్రూయిజర్​ కంట్రోల్​, కొలిసన్​ అవైడెన్స్​ అసిస్ట్​ ఉంటాయి.

Tata Curvv Price : మార్కెట్లో ఈ టాటా కర్వ్​ కారు ధర సుమారుగా రూ.10 లక్షలు - రూ.19 లక్షల వరకు ఉంటుంది.

5. Mahindra Thar Roxx : 2024లో లాంఛ్​ అయిన బెస్ట్ కార్లలో మహీంద్రా థార్ రోక్స్​ ఒకటి. ఇది ఒక 3-డోర్​ వెర్షన్​. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ కారులో అన్ని సేఫ్టీ ఫీచర్లను పొందుపరిచారు. సేఫ్టీ టెస్ట్​లో ఈ కారు 5 స్టార్ రేటింగ్ పొందింది. కనుక పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఈ కారులో భద్రంగా, హాయిగా ప్రయాణించవచ్చు.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (31.09/32)

ఈ థార్​ రోక్స్​ కారులో 6 ఎయిర్​బ్యాగ్​లు, ఈఎస్​సీ, హిల్​-హోల్డ్ కంట్రోల్​, హిల్ డిసెంట్​ కంట్రోల్​, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్​ పార్కింగ్ బ్రేక్​ విత్​ ఆటో హోల్డ్​, ఆల్​-వీల్​ డిస్క్​ బ్రేక్స్​, టీపీఎంఎస్​ ఉంటాయి. అలాగే దీనిలో లేన్ కీప్ అసిస్ట్​, అడాప్ట్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి లెవల్ 2 ఏడీఏఎస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Mahindra Thar Roxx Price : మార్కెట్లో ఈ మహీంద్రా థార్ రోక్స్ కారు ధర సుమారుగా రూ.12.99 లక్షల నుంచి రూ.22.49 లక్షల వరకు ఉంటుంది.

6. Tata Nexon EV : నెక్సాన్ ఐసీఈ (ఇంటర్నల్​ కంబస్చన్​ ఇంజిన్​) లాగానే ఈ నెక్సాన్ ఈవీ కూడా సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ పొందింది. అంతేకాదు ఐసీఈతో పోల్చితే, ఈ ఈవీ కారు హయ్యర్ స్కోర్ సాధించింది. కనుక పిల్లలు ప్రయాణించడానికి ఈ నెక్సాన్ ఈవీ కారు మరింత అనువుగా ఉంటుంది.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (29.86/32)
  • ఛైల్డ్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ - 5 స్టార్​ (44.95/49)

ఈ టాటా నెక్సాన్​ ఈవీలో 6 ఎయిర్​బ్యాగ్​లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్​, ఫ్రంట్​ అండ్ రియర్​ పార్కింగ్ సెన్సార్స్​, ఐసోఫిక్స్​ ఛైల్డ్​-సీట్​ మౌంట్స్​, హిల్​ హోల్డ్ కంట్రోల్​, హిల్​ డిసెంట్ కంట్రోల్​, ఎలక్ట్రానిక్​ పార్కింగ్​ బ్రేక్ విత్​ ఆటో హోల్డ్ లాంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Tata Nexon EV Price : మార్కెట్లో ఈ టాటా నెక్సాన్ ఈవీ కారు ధర సుమారుగా రూ.12.49 లక్షల నుంచి రూ.17.49 లక్షల వరకు ఉంటుంది.

7. Mahindra XUV 400 EV : మహీంద్రా కంపెనీ విడుదల చేసిన మరో సేఫెస్ట్ కారు ఇది. ఈ ఎలక్ట్రిక్​ కారు కూడా 5 స్టార్ రేటింగ్​ పొందింది. ఈ కారులో 6 ఎయిర్​బ్యాగ్​లు, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రోగ్రామ్​ (ఈఎస్​పీ), టైర్ ప్రెజర్​ మోనిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్​), హిల్​ హోల్డ్ అసిస్ట్​, రియర్ పార్కింగ్​ కెమెరా ఉన్నాయి. బడ్జెట్ కాస్త ఎక్కువైనా, మంచి కారు కొనాలని అనుకునేవారికి ఈ మహీంద్రా కారు మంచి ఆప్షన్ అవుతుంది.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (30.38/32)

Mahindra XUV 400 EV Price : మార్కెట్లో ఈ మహీంద్రా కారు ధర సుమారుగా రూ.15.49 లక్షల నుంచి రూ.19.39 లక్షల వరకు ఉంటుంది.

8. Tata Curvv EV : ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈవీ కార్లలో టాటా కర్వ్ ఈవీ భద్రతాపరంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ కారులో 6 ఎయిర్​బ్యాగ్​లు, రియర్ పార్కింగ్ సెన్సార్స్​, ఐసోఫిక్స్​ సీట్​ మౌంట్స్​, ఈఎస్​సీ ఉంటాయి. ఇక హయ్యర్ వేరియంట్స్​లో అయితే 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్​ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రజెర్​ మోనిటరింగ్ సిస్టమ్ ఉంటాయి. అలాగే లేన్ కీపింగ్​ అసిస్ట్​, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్​, కొలిజన్ అవైజెన్స్​ అసిస్ట్ లాంటి లెవల్​2 ఏడీఏఎస్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (30.81/32)
  • ఛైల్డ్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ - 5 స్టార్​ (44.83/49)

Tata Curvv EV Price : మార్కెట్లో ఈ టాటా కర్వ్​ ఈవీ ధర సుమారుగా రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల వరకు ఉంటుంది.

9. Tata Harrier/ Safari : రేటు ఎంతైనా ఫర్వాలేదు కానీ సేఫ్టీ కచ్చితంగా ఉండాలని అనుకునేవారికి టాటా హారియర్, టాటా సఫారీ రెండూ మంచి ఆప్షన్స్ అవుతాయి. క్రాష్​ టెస్ట్​లో ఈ రెండు ఎస్​యూవీ కార్లు భారత్ ఎస్​సీఏపీతో పాటు గ్లోబల్​ ఎన్​సీఏపీ 5 స్టార్​ రేటింగ్ పొందాయి. ఈ కార్లలో 7 ఎయిర్​బ్యాగ్​లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్​ (ఈఎస్​సీ), హిల్ అసిస్ట్​, 360 డిగ్రీ కెమెరా, టీపీఎంఎస్​, ఏడీఏఎస్ సహా బోలెడు సేఫ్టీ ఫీచర్లు​ ఉన్నాయి.

  • అడల్ట్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్ - 5 స్టార్​ (30.08/32)
  • ఛైల్డ్​ ఆక్యుపెంట్ ప్రొటక్షన్​ - 5 స్టార్​ (44.54/49)

Tata Harrier Price : మార్కెట్లో ఈ టాటా హారియర్ కారు ధర సుమారుగా రూ.14.99 లక్షల - రూ.25.89 లక్షలు ఉంటుంది.

Tata Safari Price : మార్కెట్లో ఈ టాటా సఫారీ కారు ధర సుమారుగా రూ. 15.49 లక్షల - రూ.26.79 లక్షలు ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.