ETV Bharat / offbeat

సూపర్ టేస్టీగా ఉండే "గాజర్ హల్వా" - ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరంతే! - GAJAR KA HALWA RECIPE

ఎప్పుడూ రొటీన్​ స్వీట్స్ మాత్రమే కాదు - ఓసారి వెరైటీగా "గాజర్ హల్వా"ను ట్రై చేయండి!

GAJAR KA HALWA RECIPE
Gajar Halwa Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 5:21 PM IST

Gajar Halwa Recipe in Telugu : హల్వా.. ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్ రెసిపీలలో ముందు వరుసలో ఉంటుంది. పండగలు, శుభకార్యాల టైమ్​లో చాలా మంది దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు హల్వాలో ఎన్నో రకాల వెరైటీలు ట్రై చేసి ఉండొచ్చు. కానీ, ఓసారి "గాజర్ హల్వాను" ప్రిపేర్ చేసుకొని చూడండి. సూపర్ టేస్టీగా ఉండే ఈ హల్వాను ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు! పైగా దీన్ని చాలా తక్కువ పదార్థాలతో నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. ఇంతకీ, ఈ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పింక్ క్యారెట్ తురుము - 3 కప్పులు
  • నెయ్యి - 3 టేబుల్​స్పూన్లు
  • బాదంపప్పు, జీడిపప్పు, కిస్మిస్ - ఒక కప్పు
  • బెల్లం తురుము - 1 కప్పు
  • కాచి చల్లార్చిన పాలు - 1 చిన్న గ్లాసు

బ్రెడ్ హల్వా చాలా సార్లు తిని ఉంటారు! - ఓ సారి రస్క్​తో ట్రై చేయండి - ఆ మధురం అద్భుతం!!

తయారీ విధానం :

  • ఇందుకోసం మామూలు క్యారెట్స్ కాకుండా మార్కెట్లో దొరికే పొడవుగా ఉండే పింక్ కలర్ క్యారెట్స్​ని ఎంచుకోవాలి. ఆపై వాటిని శుభ్రంగా కడిగి పైచెక్కు తీసి సన్నగా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. ఒకవేళ అవి దొరక్కపోతే మామూలు క్యారెట్స్​తోనైనా దీన్ని చేసుకోవచ్చు.
  • ఇప్పుడు స్టౌపై కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక.. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదంపప్పు పలుకులను వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు, కిస్మిస్​నూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో మరో టేబుల్​స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. అది కరిగి వేడెక్కాక.. ముందుగా సిద్ధం చేసుకున్న పింక్ క్యారెట్(గాజర్) తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్​ మీద పచ్చివాసన పోయి 80శాతం వరకు వేగేటట్లు బాగా వేయించుకోవాలి.
  • క్యారెట్ లేదా గాజర్​ తురుముని ఎంత బాగా వేయించుకుంటే హల్వా అంత రుచికరంగా వస్తుందని గుర్తుంచుకోవాలి.
  • ఆవిధంగా క్యారెట్ తురుముని వేయించుకున్నాక.. బెల్లం తురుము వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆపై కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని మరోసారి మిశ్రమం మొత్తం కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆపై కొన్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్.. వేసుకొని మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక కుక్కర్​లోని ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "గాజర్ హల్వా" రెడీ!

నోరూరించే "కొబ్బరి హల్వా" - ఈ పద్ధతుల్లో చేస్తే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.