ETV Bharat / technology

వారెవ్వా.. BMW కొత్త కారు ఏం ఉంది భయ్యా.. ఒక్క చూపుకే ఫిదా అయిపోవడం ఖాయం! - BMW M5 PERFORMANCE SEDAN

BMW M5 పెర్ఫార్మెన్స్ సెడాన్ లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..!

BMW M5 Performance Sedan
BMW M5 Performance Sedan (BMW)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 22, 2024, 3:30 PM IST

BMW M5 Performance Sedan: వాహన ప్రియులకు శుభవార్త. మార్కెట్లోకి సరికొత్త లగ్జరీ కారు వచ్చింది. BMW తన కొత్త M5 పెర్ఫార్మెన్స్ సెడాన్ కారును లాంచ్ చేసింది. ఈ కారు కేవలం 3.5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ చెబుతోంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

ఇంజిన్ అండ్ పవర్​ట్రెయిన్: ఈ BMW కొత్త కారు 4.4-లీటర్, ట్విన్-టర్బో V8 ఇంజిన్​తో వస్తుంది. ఇది 585bhp పవర్, 750Nm టార్క్​ను జనరేట్ చేయగలదు. ఇది 18.6kW బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. ఈ బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్​కు కనెక్ట్ అయి ఉంటుంది. ఇది 197బిహెచ్‌పి పవర్, 280ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కంబైన్డ్ అవుట్‌పుట్ x డ్రైవ్ ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 727bhp పవర్, 1,000Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. , ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా అన్ని 4-చక్రాలకు శక్తిని పంపుతుంది. అంతేకాక దీని ఎలక్ట్రిక్ మోటార్ 140 km/h వేగంతో 69 km నో-ఎమిషన్ రేంజ్​ను అందిస్తుంది.

కొత్త BMW M5 డిజైన్: ఈ కారులో అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లు, గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, చంకీ వీల్ ఆర్చెస్, బ్లాక్డ్-అవుట్ ORVMలు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, M-హై గ్లోస్ షాడో లైన్, కార్బన్- ఫైబర్ రూఫ్, రియర్ స్పాయిలర్, డిఫ్యూజర్ అండ్ ట్విన్ ఎగ్జాస్ట్ పైపులు ఉన్నాయి. వీటితోపాటు ఈ కారు ముందు, వెనక 20- అండ్ 21-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్ ఫీచర్స్: ఈ కారులో థ్రీ-స్పోక్ ఫ్లాట్-బాటమ్ లెదర్ స్టీరింగ్ వీల్, కర్వ్డ్ డిస్‌ప్లే, ఇల్యూమినేటెడ్ M5 లోగోతో M-స్పెక్ మల్టీఫంక్షన్ సీట్లు, 18-స్పీకర్ B&W మ్యూజిక్ సిస్టమ్, ట్రాక్ మోడ్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు అడాప్టివ్ సస్పెన్షన్, BMW 8.5 OS, లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్, l అండ్ ADAS సూట్​తో ఈ కారు వస్తుంది. ​

ధర: కంపెనీ ఈ కారును ధర రూ. 1.99 కోట్లు (ఎక్స్-షోరూమ్) ధరతో తీసుకొచ్చింది.

'సూపర్ కెమెరా'తో రెడ్​మీ 'నోట్ 14 5G' సిరీస్- టీజర్​ చూశారా?

నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్‌లకు బిగ్ షాక్- రంగంలోకి భారత ప్రభుత్వ ఓటీటీ యాప్- ఇకపై అవన్నీ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.