Jasprit Bumrah Record : పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ టాపార్డర్‌ను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలోనే ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (0)ను బుమ్రా తొలి బంతికే ఔట్ చేసి, అతడిని పెవిలియన్ పంపాడు. దీంతో బుమ్రా సౌతాఫ్రికా లెజెండరీ బౌలర్ డెల్ స్టెయిన్ రికార్డును సమం చేశాడు. టెస్టుల్లో స్టీవ్ స్మిత్‌ను గోల్డెన్ (తొలి బంతికే ఔట్ అవ్వడం) డకౌట్ చేసిన రెండో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు.
ఇప్పటివరకు డెల్ స్టెయిన్ మాత్రమే స్మిత్‌ను గోల్డెన్ డకౌట్ చేశాడు. గెబెర్హా వేదికగా 2014లో ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్‌లో స్మిత్ టెస్టుల్లో తొలిసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో అతడిని స్టెయిన్ పెవిలియన్‌కు పంపాడు. అప్పట్నుంచి స్మిత్ టెస్టుల్లో ఎప్పుడు కూడా ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ అవ్వలేదు. దాదాపు ఓ దశాబ్దం తర్వాత స్మిత్‌ను బుమ్రా గోల్డెన్ డకౌట్ చేసి కెరీర్‌లో అరుదైన ఘనత అందుకున్నాడు.
What a ball by Bumrah... Smith gone for duck 🦆🦆🦆 pic.twitter.com/DMlj49v4lQ
— Randy (@RandyThala26) November 22, 2024
కాగా, స్మిత్ సుదీర్ఘమైన తన టెస్టు కెరీర్‌లో 196 ఇన్నింగ్స్‌ల్లో బరిలో దిగగా అందులో 11సార్లు మాత్రమే పరుగులు చేయకుండా (డకౌట్) ఔట్ అయ్యాడు. అందులో ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరడం (గోల్డెన్ డకౌట్) ఇది రెండోసారి మాత్రమే. ఇక స్వదేశంలో స్మిత్‌కు ఇది తొలి గోల్డెన్ డకౌట్.
ఇక ఈ మ్యాచ్‌లో బుమ్రా చెలరేగిపోయాడు. బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తూ, తొలి నుంచే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో మూడో ఓవర్‌లోనే భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. అరంగేట్ర కుర్రాడు నథన్ స్వీనే (10 పరుగులు)ను ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఆ తర్వాత ఏడో ఓవర్లో వరుసగా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. నాలుగో బంతికి మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (8 పరుగులు)ను ఔట్ చేయగా, తర్వాతి బంతికి క్రీజులోకి వచ్చిన స్మిత్ (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖరి సెషన్‌లో బుమ్రా కెప్టెన్ కమిమ్స్ (3) వికెట్ దక్కించుకున్నాడు.
That's Stumps on what was an engrossing Day 1 of the 1st #AUSvIND Test!
— BCCI (@BCCI) November 22, 2024
7⃣ wickets in the Final Session for #TeamIndia! 👌👌
4⃣ wickets for Captain Jasprit Bumrah
2⃣ wickets for Mohammed Siraj
1⃣ wicket for debutant Harshit Rana
Scorecard ▶️ https://t.co/gTqS3UPruo pic.twitter.com/1Mbb6F6B2c
తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 67-7 స్కోర్‌తో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది.
'ఎవరిని మీడియం పేసర్ అంటున్నావ్?- నేను 150 స్పీడ్‌తో బౌలింగ్ చేస్తా'
'విరాట్‌కు ఆ రెండే కీలకం- ఒక్కసారి అలా చేస్తే ఆసీస్‌కు చుక్కలే'