ETV Bharat / spiritual

నవంబర్​ 23 కాలాష్టమి - "కూష్మాండ దీపం" వెలిగిస్తే - సంవత్సరమంతా నరదిష్టి పోయి విశేష ఫలితాలు!

-కార్తిక మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు కాలాష్టమి -కాలభైరవుడి దగ్గర మిరియాల దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు

Kushmanda Deepam on kalashtami
Kushmanda Deepam on kalashtami (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 5:26 PM IST

How to Light the Kushmanda Deepam on kalashtami: నరదిష్టిని చాలా మంది నమ్ముతారు. ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందనీ.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని భావిస్తారు. ఈ నేపథ్యంలో మీరు నరదిష్టి బారినపడకుండా ఉండాలన్నా, ఎదుటి వాళ్ల ఏడుపులు, భయంకరమైన శత్రు బాధలు పోవాలన్నా.. కార్తిక మాసంలో వచ్చే కాలాష్టమి రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిదని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

కార్తిక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారని.. అది నవంబర్​ 23వ తేదీన వచ్చిందని జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్​ కుమార్​ అంటున్నారు. ఈ కాలాష్టమి శక్తివంతమైనదని.. ఆ రోజున శివాలయంలో కాలభైరవుడి దగ్గర మిరియాల దీపం వెలిగించినా, ఇంటి గుమ్మం బయట కూష్మాండ దీపం వెలిగించినా భయంకరమైన నరపీడ, దిష్టి, శత్రుబాధలు.. వీటన్నింటిని నుంచి సులభంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు.

మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే:

  • ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
  • అనంతరం ఓ కొత్తటి తెల్ల వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో 27 మిరియాలు ఉంచి మూట గట్టాలి.
  • అనంతరం ఆ మూటను నువ్వుల నూనెలో ముంచాలి. కాలాష్టమి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో మిరియాల మూట నానేలా చూసుకోవాలి.
  • అనంతరం సాయంత్రం పూట శివాలయంలో కారభైరవుడు విగ్రహం లేదా ఏదైనా కాలభైరవ మందిరానికి వెళ్లి ఆయన ముందు మట్టి ప్రమిదను ఉంచాలి.
  • అందులో నువ్వుల నూనె పోసి అందులో ఉదయం నుంచి నానిన మిరియాల మూటను వత్తిలాగా చేసి అందులో ఉంచి దీపం వెలిగించాలి.
  • మిరియాల దీపం వెలిగించిన తర్వాత.. ఆ దీపం దగ్గర గారె ముక్కలు నైవేద్యంగా ఉంచాలి.
  • అనంతరం కాలభైరవ దర్శనం చేసుకుని.. దీపం కొండెక్కిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని(గారె ముక్కలు) శునకాలకు ఆహారంగా వేయాలి.

ఒకవేళ కాలభైరవుడి గుడి అందుబాటులో లేని వారు ఇంటి వద్ద గుమ్మడికాయ దీపాలు లేదా కుష్మాండ దీపం వెలిగించవచ్చని చెబుతున్నారు. అందుకోసం..

  • ఇంటి గుమ్మానికి రెండు వైపులా పళ్లెం లేదా విస్తరి ఉంచి అందులో రాళ్ల ఉప్పును కుప్పలాగా పోయాలి. ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నవధాన్యాలు, నల్ల నువ్వులు వేయాలి.
  • ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని రెండు భాగాలుగా చేసి అందులోని విత్తనాలను తీసేయాలి.
  • ఆ తర్వాత ఆ రెండు ముక్కలకు పూర్తిగా పసుపు రాసి పై భాగంలో గంధం, కుంకుమ బొట్లు పెట్టండి.
  • అనంతరం ఈ రెండు గుమ్మడికాయ ముక్కలను విస్తరిలో ఉంచిన రాళ్ల ఉప్పు మీద పెట్టాలి.
  • ఆ తర్వాత ఆ బూడిద గుమ్మడి ముక్కల్లో నువ్వుల నూనె పోసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి ఒక్కొక్క గుమ్మడికాయ ముక్కలో కనీసం రెండు వత్తులు వేసి దీపాలు వెలిగించాలి. నల్ల వత్తులు వేసి దీపం వెలిగిస్తే మరీ మంచిదని చెబుతున్నారు.
  • అలాగే ఆ దీపాల దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచాలి.
  • ఆ రాత్రికి దీపాలు కొండెక్కితే మరునాడు ఉదయం ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయమని చెబుతున్నారు. లేదంటే పారే నీటిలో వదిలిపెట్టమని సలహా ఇస్తున్నారు.
  • ఇలా కార్తిక మాసంలో కాలాష్టమి రోజున మిరియాల దీపం, కూష్మాండ దీపం వెలిగిస్తే సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

'కార్తిక మాసంలో ఈ శనివారం - "శంఖుచక్ర దీపం" వెలిగించండి - వేంకటేశ్వరుడి ఆశీర్వాదం మీపైనే'

కార్తిక దీపం ఆ మూడు ప్రాంతాల్లో వెలిగించాలి - అవేంటో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.