Balakrishna Mokshagna with Taraka Ratna children :నందమూరి తారకరత్న గతేడాది గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో నందమూరి ఫ్యామిలీ, అభిమానులు ఎంతో బాధపడ్డారు. ముఖ్యంగా బాలకృష్ణ అయితే చాలా ఎక్కువగా బాధ పడ్డారు. తారకరత్న చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ భాద్యతను బాలకృష్ణ చూసుకుంటున్నారని కూడా తెలిసింది. ఎప్పటికప్పుడు వారి బాగోగులు చూసుకుంటూ, అప్పుడప్పుడు కలుస్తూ, పలకరిస్తూ ఆ కుటుంబానికి తానున్న ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నారు. తాజాగా కూడా బాలయ్య తారకరత్న ఫ్యామిలీని కలిశారు. ఈ సారి బాలయ్యతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా తారకరత్న ఫ్యామిలీని కలిశారు.
తారకరత్న పిల్లలతో కలిసి బాలయ్య, మోక్షజ్ఞ ఫోటోలు కూడా దిగారు. ఆ పిక్స్‌ను తారకరత్న భార్య అలేఖ్య తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. "నేను ఏ వైపు ఉన్నానని నన్ను చాలా సార్లు అడుగుతూ వస్తున్నారు. నేను మానవత్వం, ప్రేమ, ముఖ్యంగా నా కుటుంబం వైపు ఉన్నాను. మావయ్య (బాలయ్య) మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓబు, పిల్లలు, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాము" అంటూ బాలయ్యపై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ ఫొటో, కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. మోక్షజ్ఞ, బాలయ్య, తారకరత్న ఫ్యామిలీని కలిసి కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ బాగా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.