Nalgonda Boy Selling Fruits Box For Diet People : ఇటీవల కాలంలో ఆరోగ్యంపై ప్రతిఒక్కరికి అవగాహన పెరిగింది. ప్రజలు ఆరోగ్యాలను కాపాడుకునేందుకు రకరకాల ప్రయోగాలు, కసరత్తులు చేస్తున్నారు. దీనికి తోడు సామాజిక మాధ్యమాల పరిధి విస్తృతం కావడంతో అనేక మంది వైద్యులు, యోగా శిక్షకులు, న్యూట్రిషన్ల సలహాలు నిత్యం వందల కొద్దీ మన సెల్ఫోన్లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో అనేక మంది వారికి నమ్మకం కలిగిన సలహాలను స్వీకరిస్తూ పాటిస్తున్నారు. చిరు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరల రసాలు, రాగి, జొన్న జావలు, గానుగ నూనెలు వంటిని ఇందులోకే వస్తాయి. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇది నగరానికే పరిమితమైనా, ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో విక్రయానికి పెడుతున్నారు.
గతంలో మనకు అవసరం ఉన్న పండ్లు కొనుక్కొని తినేవారు. అయితే ధర ఎక్కువగా ఉంటే పేద, మధ్య తరగతి కొనేందుకు ఆలోచించేవారు. అయినా ఇక తప్పదు అనుకుని ఒకసారికి ఒకటి, రెండు రకాల పండ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో నగరాల్లో పలు రకాల పళ్ల ముక్కలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నారు. నాలుగైదు రకాల పండ్ల ముక్కలతో పాటు డ్రైఫ్రూట్స్, మొలకలు సైతం అందిస్తుండడంతో వీటికి ఆదరణ పెరుగుతోంది.
ఈ సంస్కృతి ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పట్టణాలకు సైతం విస్తరిస్తుంది. మిర్యాలగూడకు చెందిన యువకుడు ఈ పండ్ల ముక్కల పంపిణీ ఇటీవలే శ్రీకారం చుట్టి విజయవంతంగా నడిపిస్తున్నారు. త్వరలోనే నల్గొండలో సైతం పంపిణీకి సిద్ధమవుతున్నట్లు యువకుడు చెబుతున్నాడు. ప్రతి రోజు సీజన్‌లో దొరికే పలు రకాల పండ్లు, మొలకలు, ఉడకబెట్టిన గింజలు, డ్రైఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నానని యువకుడు కల్యాణ్ చెబుతున్నాడు. దీనిని ఒక వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చేస్తున్నట్లు తెలిపాడు.
YUVA : ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్-4 ఉద్యోగాలు సాధించిన యువకులు
YUVA : స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న నేటి యువత - ఎందుకు?